సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..?  

pawan kalyan shocking comments about film industry Pawan Kalyan, Janasena, Tollywood Stars, Hyderabad, Heavy Rains, Ramcharan, Orange, Atharintiki Daredi, Piracy, Political Career, Donations - Telugu Atharintiki Daredi, Donations, Heavy Rains, Hyderabad, Orange, Pawan Kalyan, Pawankalyan, Political Career, Ramcharan, Tollywood Stars

కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి.

TeluguStop.com - Pawan Kalyan Janasena Tollywood Stars Hyderabad Heavy Rains Hyderabad

వందల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించింది.

పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు.

TeluguStop.com - సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే కొందరు హీరోలు మాత్రం విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు.

దీంతో పలువురు నెటిజన్లు కొంతమంది హీరోలను ట్రోల్ చేస్తున్నారు.ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి రాగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని వాస్తవ పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా నటులకు పేరు వచ్చిన స్థాయిలో డబ్బులు రావని.ఈ పరిశ్రమలో ప్రజలు ఊహించిన స్థాయిలో డబ్బు ఉండదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాకు నష్టాలు వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.అత్తారింటికి దారేది సినిమా పైరసీ కావడంతో ఆ సినిమాను కొనుగోలు చేయడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.

రాజకీయ వ్యవస్థ, పారిశ్రామిక రంగాలతో పోల్చి చూస్తే సినిమా పరిశ్రమ చాలా చిన్నదని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ పరిశ్రమ చాలా సున్నితమైన పరిశ్రమ అని ఈ రంగంలో నష్టాలు వస్తే సంపాదించిన మొత్తం పోతుందని అన్నారు.

విరాళం అనేది ఎవరైనా వారి ఇష్టపూర్వకంగా ఇచ్చేదని పవన్ చెప్పారు.కరోనా వల్ల చాలామందికి ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందని.

ఇలాంటి సమయంలో విరాళాలు ఇవ్వడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించారు.రాజకీయ నాయకులు సైతం తమ వంతు సహాయం చేయాలని తాను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

#Ramcharan #Pawan Kalyan #Orange #Donations #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Janasena Tollywood Stars Hyderabad Heavy Rains Hyderabad Related Telugu News,Photos/Pics,Images..