పవన్ టార్గెట్ వారే ! కారణం ఇదే !  

  • జనసేన అధినేత పవన్ స్పీడ్ పెంచారు. రోజు రోజుకి పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుండడంతో పవన్ లో సీఎం అవ్వాలనే ఆశలు మరింత పెరిగాయి. అందుకే తన రాజకీయ ప్రత్యర్థులపై గతంకంటే ఇప్పడు తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నాడు.
    ముఖ్యంగా … లోకేష్ , చంద్రబాబు, జగన్ లపై విమర్శలు ఆరోపణలు సాధించడమే అజెండాగా పెట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన బలంగా ప్రజల్లో పాతుకుపోవాలంటే నేరుగా రెండు ప్రధాన పార్టీలలో లోపాలను ఎండగట్టకపోతే లాభం లేదని డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు పవన్.

  • -

  • ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని… ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవాలంటే జనసేన రావాల్సిందే అని పవన్ గట్టి చెప్తున్నారు. ఇక లోకేష్అ గురించి విమర్శిస్తూ… అనుభవం అనుభవం అని చెప్పే ముఖ్యమంత్రి ఏ అనుభవం తో కుమారుడికి అగ్ర పీఠం వేశారని దుమ్మెత్తి పోశారు. జనసేన పార్టీ పెట్టింది జీవిత కాలం తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానికి మాత్రం కాదన్నారు. అలాగే చంద్రబాబు తనయుడు కావడమే ఏకైక అర్హతగా ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్న లోకేష్ ను సిఎం సీట్లో కూర్చోబెట్టడానికి తాము సిద్ధంగా లేమన్నారు.

  • -
  • వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ అంటే బాబు, లోకేష్ లకు చాలా భయం అని తనతో వారు జరిపిన సమావేశాల్లో అర్థమైందని పవన్ చెప్తున్నాడు. ఇసుక, మట్టి అన్నిటా అవినీతి జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి విహరించి ఏమి సాధిస్తున్నారని పవన్ విమర్శించారు. ఇక అదే స్థాయిలో జగన్ మీద కూడా విమర్శలు గుప్పించారు పవన్. కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆస్తిని వైసిపి ఎమ్యెల్యే కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని ఆరోపించారు. తాను తీయబోయే సినిమాలో నటించి తీరాలని మరో ఫ్యాక్షనిస్ట్ తననే బెదిరించారని చెప్పుకొచ్చారు. నా స్థాయిలో వున్న వారికే వారి బెదిరింపులు అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని ఇవన్నీ జగన్ కి తెలిసి జరుగుతున్నాయని అనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా ఆయన ముఖ్యమంత్రి కావాలని లోకేష్, జగన్ భావించినప్పుడు ఒక కానిస్టేబుల్ కొడుకు సిఎం కావాలనుకోవడంలో తప్పేమి లేదని తన ఆశ సరైనదనే పవన్ సమర్ధించుకున్నారు.