జనసేనను దెబ్బకొట్టింది అదేనా ? అయినా మార్పులేదా ?  

Pawan Kalyan Janasena Says No Change In The Party-

రాజకీయాల్లో కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన.ఈ చిన్న క్లారిటీ తెలుసుకోలేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను దెబ్బతినడంతో పాటు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కూడా దెబ్బతినడానికి కారణం అయ్యారు.ఎన్నికల ఫలితాలు జనసేనను తీవ్ర నిరాశ కలిగించాయి...

Pawan Kalyan Janasena Says No Change In The Party--Pawan Kalyan Janasena Says No Change In The Party-

స్వయంగా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలవ్వడం పవన్ తో సహా పార్టీ నేతలు ఎవరికీ మింగుడుపడడంలేదు.ఇప్పడు ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలు మరీ దూకుడుగా ఉండడం అందరిని ఆలోచనలో పడేస్తోంది.

ఎన్నికల్లో ఒక్కసీటుతోనే జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అయినా పవన్ ప్రసంగాల్లో ఆవేశం మాత్రం అస్సలు తగ్గలేదు.తాను రాజకీయాల్లోకి వస్తే చాలు జనాలు వద్దన్నా వచ్చి ఓట్లేసేస్తారని అంచనా వేసుకున్నారు.

Pawan Kalyan Janasena Says No Change In The Party--Pawan Kalyan Janasena Says No Change In The Party-

తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చవిచూసిన అనుభవాలు పవన్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నాడు.

ఓటమిపై పార్టీ నాయకులతో సమీక్షలు చేస్తున్న పవన్ చాలా ఆవేశంగా ప్రసంగాలు ఇస్తున్నారు.ఇప్పటి వరకూ మీరంతా నా ఆశయాలే చూశారని, ఇక ఇప్పటి నుంచి దెబ్బకు దెబ్బ తీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు.అంటే పవన్ ఆశయాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులకే సరిగ్గా క్లారిటీ లేదు.

పవన్ ఆశయాలను జనాలు చూసిందీ లేదు.అయినా ఇక నుంచి దెబ్బకు దెబ్బ తీస్తానంటూ పవన్ హెచ్చరించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికీ అర్ధం కావడంలేదు.తాను తప్పకుండా సీఎం కుర్చీ ఎక్కుతాను అని పవన్ బలంగా నమ్మాడు...

అందుకే ఎన్నికల ప్రచారాల్లో తనను సీఎం, సీఎం అనాలంటూ పవన్ పదే పదే ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు.

జనసేన ఆవిర్భావం నుంచి పవన్ అన్నీ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు.అధికార పార్టీగా, ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో చవిచూస్తున్న తెలుగుదేశాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను టార్గెట్ చేసుకుని పవన్ విమర్శలు గుప్పించాడు.చంద్రబాబు, తాను ఒకటే అని పవన్ తన మాటలు, చేష్టల ద్వారా నిరూపించుకున్నారు.

దీని ఎఫెక్ట్ కారణంగానే జనసేనకు తీవ్రం నష్టం వాటిల్లింది.పాదయాత్ర ద్వారా వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి చొచ్చుకువెళ్ళిపోతే అదే సమయంలో సమయంలో పవన్ ప్రజాపోరాట యాత్ర పేరుతో జనాల్లో తిరిగారు.కాకపోతే రెండు రోజులు యాత్రలో పాల్గొంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటూ పవన్ గడిపారు...

ఇవన్నీ జనాల్లో ఆ పార్టీని అభాసుపాలుచేసింది.పార్టీని ఇప్పటికైనా సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్ దృష్టిపెట్టకుండా ఆవేశంగా ప్రతీకార ధోరణిలో ప్రసంగాలు చేయడం విమర్శలపాలవుతోంది.