పవన్ 'పవర్' పాలిటిక్స్ ఇలా ఉండబోతున్నాయా ?

ఎన్నికల ముందు ఉండాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆలోచిస్తోంది జనసేన పార్టీ.పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓటమి చెందిందో అర్ధంకాని విషయంగా మారిపోయింది.

 Pawan Kalyan Janasena Preparing For Politics Of Ap1-TeluguStop.com

సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు అనే విషయం కూడా పవన్ కు కాస్త ఆలస్యంగా తెలిసొచ్చింది.
అందుకే ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆ సమీక్షల్లో తెలుస్తున్న అంశాలతో అప్పుడప్పుడూ పవన్ ఆవేశానికి కూడా గురవుతున్నాడు.అయినా తన రాజకీయ వ్యూహంపై మాత్రం క్లారిటీ గా ఉన్నాడు.

అందుకే ఇప్పటివరకు మీరు చుసిన రాజకీయం వేరు, ఇకపై చూడబోయే రాజకీయం వేరు అని పార్టీ శ్రేణులతో పాటు మిగతా పార్టీల వారికి అర్ధమయ్యేలా వార్ణింగ్స్ ఇస్తున్నాడు.

-Telugu Political News

జనసేన ఓటమికి వేరే ఏ కారణాలు కనిపించడంలేదని, కేవలం ఎన్నికల్లో డబ్బు పంచకపోవడం వల్లే ఇటువంటి చేదు ఫలితాలు చవిచూశామని పవన్ నచ్చచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.తాను కనుక అసెంబ్లీ లో అడుగుపెడితే మిగతా రాజకీయ పార్టీలకు చిక్కులు తప్పవనే ఉద్దేశంతో తనకు ఓడించడానికి సుమారు రూ.150 కోట్లు వరకు ఖర్చుపెట్టారని, ఈ విషయంపై స్పష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని పవన్ చెప్పుకొస్తున్నారు.తనకు ఓడిపోయానన్న బాధ ఏమీ లేదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తానేంటో చూపించాలని నిర్ణయించుకున్నామన్నారు.ఈ క్రమంలో జనసేనను కొత్త పద్దతిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చూస్తున్నానని పవన్ చెబుతున్నారు.

-Telugu Political News

ఇప్పటి వరకూ ఇతర పార్టీల కంటే భిన్నమైన రాజకీయం చేశారు.హంగులు, ఆర్భాటాలు, ఓట్ల కొనుగోళ్లు, నేతలను ఆకర్షించడం వంటి వాటికి దూరంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం వాటినే ఇతర రాజకీయ పార్టీలు , నాయకులు చేతకాని తనం అన్నట్లుగా చూస్తూండటంతో ఇకపై పంధా మార్చుకుని.సంప్రదాయ రాజకీయాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇకపై పవన్ మార్క్ పాలన అంటే ఏంటో ముందు ముందు చూస్తారని పవన్ చెప్పడం వెనుక కారణం కూడా ఇదేనని ఆ పార్టీ లో చర్చ నడుస్తోంది.క్షేత్ర స్థాయిలో జనసేనను వైసీపీ, టీడీపీకి ధీటుగా బలపరచనాలని అప్పుడే జనసేన పూర్తిస్థాయిలో ఇప్పుడున్న పార్టీలకు ధీటుగా తయారవ్వుతుందని పవన్ భావిస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube