జనసేనకు ఆర్ధిక కష్టాలు..? ఆ నిర్ణయమే కారణమా ..?     2018-09-23   05:35:43  IST  Sai M

రాజకీయాలను అడ్డంపెట్టుకుని కోట్లు సంపాదించేవారు ఉన్నారు ! రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులను కరిగించుకున్న వారు ఉన్నారు. ఆ రెండోభాపతిలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పవన్ సినిమాల్లో ఉండగా ఆయనకు అటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అంతా ఖర్చే. పార్టీని నడపడానికి ఆర్ధికంగా పవన్ చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు.. ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఆర్థిక బాధలంటే ఏమిటో తెలియని పవర్‌స్టార్‌ ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్చుకుంటున్నాడట. పవన్‌ ఇప్పుడు తన పోరాటయాత్రలో కళ్యాణ మండపాల్లో, సత్రాల్లో బస చేస్తున్నాడు. చేతిలో నిధులు లేకపోవడంవల్లనే ఆయన పోరాటయాత్రకు నెలకు పైగా విరామం వచ్చింది. ఆర్థిక సంక్షోభానికి తోడు మధ్యలో కంటి ఆపరేషన్‌ జరిగి యాత్ర మరింత ఆలస్యమైంది. పవన్‌ భారీ మొత్తాల్లో విరాళాలు స్వీకరించడంలేదని తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభానికి ఇది ప్రధాన కారణంగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.

సినిమాల్లో తాను సంపాదించినదంతా గత మూడేళ్లలో పార్టీకే ఖర్చుపెట్టాడని చెబుతున్నారు. పవన్‌ చేస్తున్న పోరాటయాత్ర ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి రోజుకు ఐదులక్షలు ఖర్చవుతున్నాయి. రవాణా, బస, ఆహారం మొదలైన ఖర్చులన్నీ కలుపుకొని అదిరిపోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అంతా కలుపుకొని 160 మంది వరకు ఉన్నారు. వీరందరికీ జీతాలు చెల్లించాలి. పవన్‌ ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీని నడపడం ముందు ముందు కష్టం అవుతుందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.

Pawan Kalyan Janasena Party Getting Financial Problems-Elections In AP,Financial Problems For Janasena,Janasena,pawan Kalyan Janasena,Pawan Kalyan Janasena Party Getting Financial Problems

పవన్ ని రాజకీయంగా వాడుకోవాలని ఉద్దేశంతో భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చేందుకు వస్తున్న వారి నుంచి విరాళాలు తీసుకునేందుకు పవన్ నిరాకరిస్తున్నాడని, ప్రజలు, పార్టీ మీద అభిమానంతో ఇచ్చే స్వల్ప విరాళాలు మాత్రమే తీసుకుంటున్నదని అందుకే జనసేనకు ఈ ఆర్ధిక కష్టాలు ఏర్పడ్డాయట. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీని నడపడమంటే మాటలుకాదు ప్రతీది డబ్బుతో కూడుకున్న పనే.