ఆ నినాదంతోనే జనసేన ముందుకు వెళ్లబోతోందా ?  

Pawan Kalyan Janasena Over Special Status To Andhra Pradesh -

జనసేన వచ్చే ఎన్నికలనాటికి బలమైన రాజకీయ పార్టీగా మారడంతో పాటు అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో ఇప్పుడు అడుగులు వేస్తోంది.అయితే ఏదో ఒక బలమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఇమేజ్ ను పెంచాలని పవన్ చూస్తున్నాడు.

Pawan Kalyan Janasena Over Special Status To Andhra Pradesh

ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరమీదకు వచ్చింది.గతంలోనే పవన్ ప్రత్యేక హోదాపై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, ఆమరణ దీక్ష చేపడతానని జనసేన గుంటూరు నాల్గవ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు.

కానీ అప్పటి నుంచి ఈ విషయం పై పవన్ పెద్దగా స్పందించలేదు.పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం అనే అంశాన్ని కేవలం ట్విట్టర్ కే పరిమితం చేశారనే విమర్శలు కూడా చెలరేగాయి.

ఆ నినాదంతోనే జనసేన ముందుకు వెళ్లబోతోందా -Political-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు హోదా అంశాన్ని తెరకెక్కించడం ద్వారానే జనసేనను మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చని పవన్ భావిస్తున్నాడట.

జనసేన గతంలోనే ఏపీకి హోదా కోరుతూ అధికార టీడీపీ ఢిల్లీ వేదికగా నిరసనలు, దీక్షలు చేపట్టింది.

హోదాకోసం వామపక్షాలతో కలిసి పవన్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు.అయితే హోదాపై పోరు తూతూ మంత్రంగానే నిర్వహించారు తప్ప ఈ విషయంలో గట్టిగా నిలబడలేదనే విమర్శలు కూడా చెలరేగాయి.ప్రస్తుతం ఈ విషయాన్ని హైలెట్ చేసే ఉద్దేశంలో ఉండడంతో పవన్ తన జోరు ఎలా పెంచుతారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేసుకున్నాయి.ఆ తరువాత ఆ అంశాన్నే మరిచిపోయాయి.2019 ఎన్నికల్లో పోటీ చేయడం పవన్ జనసేన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో జనసేనాని కూడా హోదా విషయాన్ని పక్కన పెట్టేసారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన రాజకీయంగా పుంజుకోవాలంటే ఇదే సరైన మార్గమని జనసేన కీలక నాయకులు కూడా అభిప్రాయపడడంతో పవన్ ఇదే రూట్లో వెళ్లాలని డిసైడ్ అయ్యాడట.ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల హామీలు, వైఫల్యాల విషయంలో గట్టిగా ప్రశ్నించి వైసీపీ కి ప్రత్యామ్న్యాయం తామే అన్నట్టుగా జనసేనను ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ చూస్తున్నాడు.అవసరం అయితే ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని తీసుకెళ్లాలని పవన్ ఆలోచనట.అయితే ప్రస్తుతం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా పవన్ చర్చిస్తున్నారట.

ఒక క్లారిటీ వచ్చాక బహిరంగంగా ఈ అంశంపై స్పందించాలని జనసేనాని చూస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు