ఆ విషయంలో పవన్ కి క్లారిటీ రావడంలేదా ..? ఈ సైలెన్స్ అందుకేనా ...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు… తన రాజకీయ అడుగులు ఎలా వేయాలో తెలియక సతమతం అవుతున్నాడు.ఇప్పుడు ఎన్నికలకు సమయం ఎంతో లేకపోవడం… రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో పవన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు.

 Pawan Kalyan Janasena Not Getting Clarity On Party Candidates1-TeluguStop.com

అసలే మొదటిసారి ఎన్నికల బరిలోకి వెళ్తున్నాడు కాబట్టి పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇంతకీ పవన్ ను ఇంత టెన్షన్ పెడుతున్న విషయం ఏంటి అంటే…? పొత్తు.ఈ విషయంలో ఎలా అడుగులు వేయాలో తెలియక పవన్ ఇబ్బంది పడుతున్నాడు.కొంతకాలంగా జనసేన – వైసీపీ పొత్తు దాదాపు ఖరారు అయిపొయింది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ దాన్ని ఖండించాడు.

జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తుంది అని ప్రకటించాడు.కానీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అనేక కధనాలు వస్తున్నా పవన్ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.

సాక్ష్యాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన టీడీపీ కలిసి వెళ్తే జగన్ కి నొప్పి ఏంటి అని బహిరంగంగా వ్యాఖ్యానించినా… నోరు మెదపలేని పరిస్థితుల్లో పవన్ ఉండిపోయాడు.దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే పవన్ కూడా ఈ పొత్తు వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడట.ఇక ఈ రెండు పార్టీలు మీద అప్పుడే వైసీపీ యుద్ధం ప్రకటించేసింది.పవన్ చంద్రబాబు పార్టనరేనంటూ.విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.అయినా… జనసేన అధినేత మాత్రం ఈ విషయంలో ఎక్కడా స్పందించినట్టు కనిపించలేదు.వాస్తవంగా పవన్ విజయవాడలోనే ఉన్నప్పటికి.జరుగుతున్న ప్రచారంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు.కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా.తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

దీంతో.ఆయన తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై… ఆలోచనలో పడినట్టుగా అర్ధం అవుతోంది.

అసలు ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళితే తమకు కలిసి వస్తుంది అనే విషయంపై పవన్ లెక్కలు వేసుకుంటున్నారని… దీంతో పాటు… ప్రజా స్పందనను బేరీజు వేసుకునే పనిలో పవన్ నిమగ్నం అయినట్టు వాతావరణం కనిపిస్తోంది.నిజానికి పవన్ కల్యాణ్‌తో పొత్తును తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా.అనే దానిపైనా క్లారిటీ లేదు.జనసేన, టీడీపీ కి మధ్య చీకటి ఒప్పందం ఉంది అని జగన్ తరుచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బాబు అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు.

వాస్తవంగా పవన్ ఒంటరిగానే ఎన్నికలబరిలోకి వెళ్లేందుకు ముందుగా సిద్ధం అయ్యారు.అందుకే జనసేనతో కలిసి వామపక్ష పార్టీలు అడుగులు వేసేందుకు సిద్ధం అయినా… పవన్ వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో టఫ్ ఫైట్ నెలకొనబోతున్నందున ఏదో ఒక పార్టీతోనే ముందుకు వెళ్లాలని… అది ఎలా వెళ్ళాలి అనేదానిపైనే పవన్ తర్జన భర్జన పడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube