ఈ నిర్ణయం దురదృష్టకరమన్న పవన్‌

ఏపీ మండలి రద్దు నిర్ణయంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాజకీయ కారణాలతో రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ పవన్‌ అన్నాడు.

 Pawan Kalyan Janasena Mandali Jagan-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో మండలి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

శాసన సభలో ఏమైనా తప్పులు జరిగితే అవి మండలిలో సరిదిద్దే ఉద్దేశ్యంతో మండలి ఏర్పాటు చేయడం జరిగింది.దాన్ని రద్దు చేసి రాజకీయం చేయాలనుకోవడం దారుణం అంటూ ప్రభుత్వ తీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మండలి రద్దు నిర్ణయం ఏ ఒక్కరు సమర్ధించరు అన్నాడు.మండలి రద్దు నిర్ణయంకు జనసేన పూర్తిగా వ్యతిరేకం అన్నాడు.పవన్‌ ఒక వైపు మండలి రద్దుకు వ్యతిరేకం అంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక మాత్రం మండలి రద్దు నిర్ణయంను సమర్ధిస్తూ ఓటు వేశాడు.శాసన సభపై మరో సభ ఉండాల్సిన అవసరం లేదు అంటూ రాపాక అభిప్రాయం వ్యక్తం చేశాడు.

శాసభసభ్యుడిగా జనసేన తరపున గెలిచినా కూడా ఏ ఒక్క పార్టీ నిర్ణయాన్ని ఆయన పాటించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube