జనసేనాని బీజేపీతో కలయిక... ఎదురుదాడి చేస్తున్న వైసీపీ నేతలు  

Ysrcp Leaders Target On Pawan Kalyan-bjp,janasena,target On Pawan Kalyan,ysrcp Leaders

ఏపీ రాజకీయాలలో ఎప్పటికైనా తమకి ప్రధాన ప్రత్యర్ధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారుతాడని గ్రహించిన వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడితోనే విమర్శలు చేయడం, సోషల్ మీడియాతో పాటు, బయట నాయకులు కూడా వ్యక్తిగత హననం చేసి ఎలా అయిన అతని ఇమేజ్ ని దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కొత్తగా కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ పార్టీ మద్దతు దొరికింది.

Ysrcp Leaders Target On Pawan Kalyan-bjp,janasena,target On Pawan Kalyan,ysrcp Leaders తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరా-YSRCP Leaders Target On Pawan Kalyan-Bjp Janasena Target Kalyan Ysrcp

బీజేపీ పార్టీతో రానున్న నాలుగేళ్ళు కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం, ఈ పొత్తు అధికారికంగా కన్ఫర్మ్ అవడం జరిగింది.

అయితే జనసేన పార్టీ ఒంటరిగా ఉన్నప్పుడే ఇబ్బందిగా భావించిన అధికార పార్టీ వైసీపీకి ఇపుడు పవన్ కళ్యాణ్ కి బీజేపీ అండ దొరకడం ఇంకా ఇబ్బందికరంగా మారింది.

నిజానికి వైసీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన అది జరగలేదు.బీజేపీ కూడా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ జనసేనానితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించింది.

దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలెట్టారు.ఇప్పటికే అంబటి రాంబాబు గురువారం మీడియా ముందుకి వచ్చి పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో ప్రజలకి సమాధానం చెప్పాలని అన్నారు.

ఇక తాజాగా పెర్ని నాని తాజాగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఓఎల్ఎక్ష్ లో పెట్టుకోవచ్చని అన్నారు.ప్రత్యేక హోదా కండిషన్ తో పవన్ బీజేపీలో చేరితే బాగుండేదని అన్నారు.

అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, అది చంద్రబాబు స్కెచ్ లో భాగంగానే జరిగిందని విమర్శలు చేశారు.అయితే బీజేపీ-జనసేన కలయిక వలన తమకి ఎలాంటి నష్టం ఉండదని అంటూనే ఇలా ఎదురుదాడి చేస్తున్నారంటే వైసీపీ పార్టీ భయపడుతుందని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు.

తాజా వార్తలు

Ysrcp Leaders Target On Pawan Kalyan-bjp,janasena,target On Pawan Kalyan,ysrcp Leaders Related....