ఎన్టీఆర్ ఫార్ములా పై పవన్ చేతులెత్తిసినట్టేనా ...?

జనసేన కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.మొదటిసారి ఎన్నికల బరిలోకి వెళ్లబోతోంది.

 Pawan Kalyan Janasena Is Not Following Ntr Formula-TeluguStop.com

అయితే తాము రాజకీయాలకు కొత్త అయినా… కొత్త తరహాలో రాజకీయం చేస్తాను అని ఆ పార్టీ అధినేత పవన్ చెప్పుకుంటూ వస్తున్నాడు.అందుకే ఇప్పటివరకు ఉన్న పార్టీలకు కాస్త భిన్నంగా పార్టీని నడపాలని చూస్తున్నాడు.

అంతే కాదు … పార్టీలోకి వచ్చి చేరతామన్న నాయకులు అందరినీ ఆహ్వానించకుండా… కేవలం కొంతమందికి మాత్రమే ఇప్పటివరకు పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ వచ్చాడు.ఇక్కడ పవన్ ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని తన పార్టీని నడపాలని చూస్తున్నాడు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నికల్లో మొదటిసారిగా బరిలోకి వెళ్ళినప్పుడు ఆయన తమ పార్టీ నుంచి దాదాపు మెజార్టీ స్థాయిలో కొత్త ముఖాలను పరిచయం చేసాడు.

ఆ ఫార్ములా సక్సెస్ అయ్యింది.ఇక పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా… అదే ఫార్ములాను ఉపయోగించాడు.అయితే ఆ ప్రయోగం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే పవన్ కూడా ఎన్టీఆర్ ఫార్ములాను ఉపయోగించాలనే ఆలోచనతో మొన్నటివరకు ఉన్నాడు.కానీ రాను రాను పవన్ వైకిరి లో మార్పు కనిపిస్తోంది.

అసలు ఇప్పటికే వైసీపీ, టీడీపీ నుంచి కొంతమంది నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా… పవన్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదు.పవన్ ఎక్కువగా కొత్త ముఖాలను పరిచయం చేయాలనే వలసలకు బ్రేకులు వేస్తున్నాడు.

జనసేన పార్టీ నుంచి కొత్తగా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకునే వారు టికెట్లు ఆశిస్తున్నారు.రాజకీయాల్లో మార్పు తేవడానికె జనసేన ఆవిర్భవించింది అని ప్రకటించిన పవన్ పై పెట్టుకున్న గంపెడాశ పెట్టుకున్నారు.

ఆయనంటే ప్రాణాలు ఇచ్చేవారు.అయితే ఆ పార్టీ పక్క పార్టీల నేతల చేరికల కోసం ఎదురు చూడటంతో కొత్త ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది.పాత తరం నాయకులే మళ్ళీ ఇక్కడ కూడా ఆక్రమించేస్తే కొత్త ముఖాలకు చోటు ఎక్కడ దక్కుతుంది అనే సందేహం వారిలో కనిపిస్తోంది.ఏ పార్టీలో లేకుండా కొత్త రాజకీయం ఆశిస్తున్న వారితోనే జనసేన ప్రజల్లోకి వెళుతుంది అని గతంలో పవన్ ప్రకటించాడు.

అయితే క్రమక్రమంగా పవన్ ఆ వైకిరిని మార్చుకున్నాడు.పవన్ పెట్టుకున్న నిబంధనలను సడలింపులు, సవరణలు ఇస్తూ వచ్చారు.ఇప్పుడు జనసేన తన సిద్ధాంతాలు పూర్తిగా సడలించుకుని సీనియర్లు, మాజీలు, తాజా నాయకుల కోసం గేట్లు పవన్ రాయబారాలు నడుపుతున్నాడు.ప్రస్తుత రాజకీయ పోటీ వాతావరణంలో ఎన్టీఆర్ ఫార్ములాను నమ్ముకుంటే దెబ్బతింటామనే విషయాన్ని పవన్ కోటరీ నాయకులు పదే పదే నూరి పొయ్యడంతో పవన్ లో కూడా మార్పు వచ్చిందట.

ఎన్టీఆర్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దాదాపు తొంబై శాతం మంది కొత్తవారే.అప్పట్లో ఆ ఫార్ములా సక్సెస్ అయ్యింది.

ఆ తరువాత ప్రజారాజ్యం ఆ ఫార్ములా ఉపయోగించి ఘోరంగా దెబ్బతినడంతో జనసేన వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube