పవన్ వీటిని ఎలా ఎదుర్కుంటాడు..? ఆ ఎత్తులు పనిచేస్తాయా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నా … చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నాడు.మరో నాలుగు నెలల్లో ఎన్నికల ఉండడంతో ఎలాగైనా ఆ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలక కావాలని భావిస్తున్నాడు.

 Pawan Kalyan Janasena How Would The Face That Problem-TeluguStop.com

అందుకే ఏపీ మొత్తం ఫోకస్ పెట్టకుండా తనకు బలమైన గెలవగలనని నమ్మకం ఉన్న జిల్లాలు ఆయన ఎంపిక చేసుకున్నాడు.అక్కడే తన పర్యటనలు ప్రచారాలు తరచూ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నాడు.

దీనిపై ఎటువంటి రాజకీయ విమర్శలు వచ్చినా … పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు… ఉత్తరాంధ్ర రాయలసీమలోని అనంతపురం ఈ ప్రాంతాలను పవన్ ని ఎంపిక చేసుకున్నట్లు గా కనిపిస్తుంది.అలాగే… కులాల లెక్కల మీద కూడా దృష్టిపెట్టాడు.

పైకి ఆయన కుల రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతూనే వాటినే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నారు.ఇప్పటి వరకు కవాతు నిర్వహించిన ప్రాంతాలు రెండే రెండు.ఒకటి రాజమండ్రి, రెండు అనంతపురం.

ఈ రెండు చోట్లా కూడా కాపు, బలిజ సామాజిక వర్గాల ఓట్లను పరిగణనలోకి తీసుకున్న పవన్ వారికి చాలా దగ్గర అయ్యేందుకు ప్రయత్నిం చారు.ఈ సామాజిక వర్గాలకు తను దగ్గర అయితే,.

మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న ఈ రెండు జిల్లాల్లోనూ తూర్పు, అనంతపురంలో మెజారిటీ సీట్లు తన ఖాతాలో పడే ఛాన్స్ ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నాడు.అయితే ఆ జిల్లాల్లో ఇప్పటి వరకు టీడీపీకి, వైసీపీకి బలమైన పట్టు ఉంది.

అంతేకాదు, ఈ రెండు జిల్లాల్లోనూ బలమైన నాయకులు టీడీపీ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించారు.వారిని ఢీ కొట్టి ఎన్నికలల్లో విజయం సాధించడం పవన్ అనుకున్నంత సులువు కాదు.

ప్రస్తుతం జనసేన హడావుడి పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా… ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పడం కష్టం.ఇప్పుడు పైకి కనిపిస్తున్న హాడావుడి రేపు ఎన్నికల టైం వరకు ఉంటుందా అనేది తేలాలి.ఇక, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే పవన్ హవా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.కానీ క్షేత్ర స్థాయిలో పార్టీ మాత్రం ఇంకా బలపడలేదు.అసలు అలా తీసుకెళదామన్నా… పార్టీకి ఇంకా ఎన్నికల గుర్తు రాలేదు.ఒకవేళ ఎన్నికల సమయంలో గుర్తు కేటాయించినా… ఆ గుర్తును ప్రజల్లోకి ఎంత స్పీడ్ గా తీసుకెళ్తారో చూడాలి.

తక్కువ సమయంలో గ్రామీణ ఓటర్లకు ఆ గుర్తు గుర్తుండిపోయేలా చేయడం పెద్ద ఇబ్బందికర పరిణామమే.ఇక తనకు బలమైన ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ… వైసీపీ పార్టీలు క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు కలిగి ఉన్నాయి.

వీటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటాడా అనేదానిపైనే పవన్ గెలుపు లెక్కలు ఆధారపడి ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube