పవన్ కి ఆ భయం పోలేదా ...? వీరందరికీ నిరాశ తప్పదా ..?

జనసేన ! ఈ పేరు కానీ ఈ పార్టీ అధినేత గాని ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాఫిక్.అసలు పోటీలోనే ఉండదు అనే స్థాయి నుంచి ప్రధాన పోటీదారు అనే స్థాయికి జనసేన ఎదిగింది.

 Pawan Kalyan Janasena Fearing About Party Candidate Tickets-TeluguStop.com

రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గా ఈ పార్టీ అడుగులు వేస్తోంది.అసలు ఏపీలో జనసేన పార్టీ పుట్టి చాలా కాలం అయింది.

ప్రస్తుతం మొదటి సారి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.అయితే దానికి తగ్గట్టుగా ఆ పార్టీలో స్పీడ్ కనిపించడం లేదు.

ప్రస్తుతం జనసేన లో పవన్ ఒక్కరే వన్ మాన్ షో అన్నట్టుగా ఉన్నారు.పార్టీ నాయకులు కొంతమంది కీలక నాయకులు ఉన్నా… వారి వారి ప్రభావం కూడా అంతంత మాత్రమే.పార్టీలో మొత్తం ఫోకస్ అంతా పవన్ కేంద్రంగానే ఉంది.ఆ పార్టీలో పదవులు భర్తీ మీద చాలా కాలంగా అనేక కథనాలు వస్తున్నా.పవన్ మాత్రం స్పందించడం లేదు.

అసలు జనసేన పార్టీ పదవులు భర్తీ చేయాలంటే పవన్ వెనకడుగు వేస్తున్నాడు.

అసలు ఇప్పట్లో పదవులు భర్తీ చేసే ఉద్దేశం లేదని కూడా చెప్పేస్తున్నాడు.కొంతమంది నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చినా… జిల్లాస్థాయి మండలస్థాయి గ్రామస్థాయి లో కమిటీల నిర్మాణమే జరగలేదు.

ఒకవైపు చూస్తే… ఎన్నికలకు నాలుగు నెలలు కూడా సమయం లేదు.ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కుంటాడు అని ప్రశ్న తలెత్తుతోంది.

అయితే పవన్ మాత్రం జనసేన కు పవన్ ఒక్కడే సరిపోతాడని నన్ను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటూ పార్టీ పదవులు విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు.అయితే పార్టీలో మాత్రం పదవుల విషయం గురించి నాయకులు కొంతమంది అనేకసార్లు పవన్ దగ్గర ప్రస్తావించినా… నేను పదవుల భర్తీ చేపట్టక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ దాటవేస్తున్నారు.

తన పేరు పార్టీ పేరు చెప్పుకొని ఎక్కడ టిక్కెట్లు అమ్ముకుంటారో అన్న భయం కూడా పవన్ లో కనిపిస్తోంది.అందుకే పార్టీ అభ్యర్థుల ఎంపికను కూడా స్వయంగా తానే పరిశీలించి తానే దగ్గరుండి అవన్నీ చూసుకుంటానని పవన్ చెబుతున్నాడు.

దీని వెనుక కారణాలు విశ్లేషిస్తే… ప్రజా రాజ్యం పార్టీ లో తలెత్తిన పరిణామాలు జనసేన లో కూడా తలెత్తకుండా ముందే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది.అసలు ఎన్నికలకు వెళ్లే ఏ పార్టీ అయినా… గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ కమిటీలు ఉండాలి.

అయితే జనసేనలో కమిటీ లేకపోయినా బలమైన క్యాడర్ ఉందని, పవన్ నమ్ముతున్నాడు.

ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవడానికి ఆ కమిటీలే కారణమయ్యాయని… నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం తన అన్న చిరుని తప్పుదారి పట్టించి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే వరకు తీసుకెళ్లారని, అందుకే గత అనుభవాల దృష్ట్యా కమిటీలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.అంటే జనసేన లో పార్టీ పదవుల కోసం ఆశగా ఎదురుచూసే వారికి ఇక నిరాశే అని పవన్ చెప్పకనే చెప్పేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube