‘ఆపరేషన్‌ 2019’ ముదురుతున్న వివాదం... పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చి పోతున్నారు

శ్రీకాంత్‌ హీరోగా బాబ్జీ దర్శకత్వంలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆపరేషన్‌ 2019’ చిత్రం వివాదాస్పదం అయ్యింది.ఈ చిత్రంలో ఒక డైలాగ్‌ వల్ల పవన్‌ ఫ్యాన్స్‌, జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Pawan Kalyan Janasena Fans Fires On Operation 2019 Movie-TeluguStop.com

ఆ డైలాగ్‌ పవన్‌ను విమర్శించే విధంగా ఉందని, పవన్‌ పరువు తీసే విధంగా ఉందని, పవన్‌ను ఎద్దేవ చేసే విధంగా ఉందంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.దాంతో తాజాగా దర్శకుడు బాబ్జీ ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

అయినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చి పోతున్నారు.ఆ డైలాగ్‌ను వెంటనే తొలగించాల్సిందే అంటూ సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంతకు సినిమాలోని ఆ డైలాగ్‌ ఏంటీ అంటే… మాసిపోయిన గడ్డంతో తిరిగితే ఓట్లు రాలవు… ఇది ఆ డైలాగ్‌.పవన్‌ కళ్యాణ్‌ ఎక్కువగా గడ్డంతో తిరుగుతూ ఉంటాడు.అందుకే దర్శకుడు బాబ్జీ తమ నాయకుడిని విమర్శించేలా ఆ డైలాగ్‌ను రాశాడని, పవన్‌పై అంత చులక భావమా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.బాబ్జీనీ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ప్రతి ఒక్కరు పవన్‌ను విమర్శించడమేనా అంటూ ఆగ్రహంతో బూతులు కామెంట్స్‌గా పెడుతున్నారు.

దాంతో బాబ్జీ మీడియా ముందుకు వచ్చి ఆ డైలాగ్‌ పవన్‌ను ఉద్దేశించి రాసినదని మీరు ఎలా భావిస్తారు.సినిమా చూసిన వారు ఎవరు కూడా ఆ డైలాగ్‌ గురించి తప్పుగా అర్థం చేసుకోరు అన్నాడు.ఆ సందర్బంగా ఏంటో చూసి మీరు నాపై విమర్శలు చేయండి అంటూ దర్శకుడు కోరాడు.

పెద్దగా క్రేజ్‌ లేన ఆపరేషన్‌ 2019 చిత్రానికి పవన్‌ వివాదం వల్ల మీడియాలో చోటు దక్కింది.ఇలా అయినా కాస్త కలెక్షన్స్‌ వస్తాయేమో అని నిర్మాతలు ఆశ పడుతున్నారు.శ్రీకాంత్‌ గతంలో నటించిన ఆపరేషన్‌ దుర్యోదన చిత్రానికి ఇది కాస్త అటుఇటుగా ఉంది.ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube