అభిమానులంతా పవన్ కి అలా దూరం అవుతున్నారా ..?

రాజకీయం వేరు రౌడీయిజం వేరు అని కొత్త శ్రీనివాసరావు ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు.సినిమా వేరు రాజకీయం వేరు అనే డైలాగ్ ఇప్పుడు పవన్ అభిమానులు చెప్తున్నారు.

 Pawan Kalyan Janasena Fans Disappointed About Party Ticket-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కి అభిమానులే బలం.తెలుగు సినిమాలో ఏ హీరోకి లేనంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కి ఉంది.యూత్ అంతా ఆయన పేరు చెప్తే ఊగిపోతుంటారు.కానీ పవన్ ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యాడు.పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారాడు.ఆయనతో పాటే పవన్ సినీ అభిమానులు కూడా జనసేనను అబిమానించడమే కాదు.

మొదటి నుంచి పార్టీ తరపున వారే కష్టపడుతూ ఈ స్థాయికి తీసుకు వచ్చారు.అయితే ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది.

పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న యవకులంతా జనసేన వచ్చిన తర్వాత తమకు పదవులు వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నారు.తీరా ఇప్పుడు ప్రతిజిల్లాలో కొత్తవారికి అవకాశాలిస్తుండటంతో అసలైన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
పవన్ యాత్రల్లోనూ ఇది స్పష్టమవుతోంది.పవన్ అభిమాన సంఘ నాయకులమని చెప్పుకుంటున్న వారికి సైతం కొన్నిచోట్ల ఆయన్ను కలవడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది.తొలిరోజుల్లో జెండాలు మోసి, బ్యానర్లు కట్టి కష్టపడ్డ వారిని కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులూ దూరం పెడుతున్నారు.అయినా పవన్ మీద అభిమానంతో వారు ఇవన్నీ భరిస్తున్నారు.

సినిమా పరంగా పవన్ వీరాభిమానులు సైతం, పాలిటిక్స్ లోకి వచ్చే సరికి పక్క పార్టీల వైపు చూస్తున్నారు.దీనికి కారణం వలస నాయకులే అని పవన్ అభిమానులు చెప్తున్నారు.ఇక సిసిల మీడియావైలో కూడా పవన్ అభిమానులు తమ బాధ చెప్పుకుంటున్నారు.కానీ ఎక్కడ పార్టీ పేరు డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే ఈ విషయాలన్నీ పవన్ దృష్టికి చేరినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవర్ని ఏమి అనలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు.కానీ చాప కింద నీరులా ఉన్న ఈ అసంతృప్తి పార్టీ ని ముంచకముందే పవన్ మేల్కొని ఈ సమస్యలకు ఒక పరిష్కారం వెతక్కపోతే ఆ తరువాత పరిణామాలకు కూడా ఆయన సిద్ధం గా వుండల్సిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube