జనసేనానిలో ఊపు తగ్గిందా ..? వాయిదాల యాత్ర కొనసాగేనా ..?

రాజకీయాలంటే సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు.ఒకటి రెండు సీన్లలో నటించి రెస్ట్ తీసుకోవడం అంతకన్నా కాదు.

 Pawan Kalyan Janasena Dual Politics-TeluguStop.com

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అని అయన అభిమానులు హడావుడి చేస్తుంటే.పవన్ మాత్రం తన రొటీన్ వ్యవహారశైలితో అందరిలోనూ అసహనాన్ని కలిగిస్తున్నాడు.

ఇటీవల పవన్ చేపట్టిన యాత్ర కూడా సక్రమంగా జరగకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ కలుగుతోంది.రంజాన్ సెలవలు అంటూ యాత్రకు బ్రేక్ చెప్పిన ఆయన ఆ తరువాత అనారోగ్యం సాకు చూపించి రెస్ట్ తీసుకుంటున్నాడు.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని చుట్టేసిన పవన్‌కళ్యాణ్‌, విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తూ, రంజాన్‌ సెలవులు తీసుకున్నారు.మళ్ళీ యాత్ర ప్రారంభించేది ఎప్పుడో మాత్రం తెలియడంలేదు.కంటి చూపు సమస్యతో పవన్‌ బాధపడుతున్నారని అందుకే యాత్ర ఆలస్యం అవుతోందని దీనికి తోడు పవన్‌కళ్యాణ్‌కి వెన్ను నొప్పి సమస్యలు ఉన్నాయని అందుకే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్తున్నాయి.

నిజానికి, పవన్‌కళ్యాణ్‌ పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్ళాలనుకున్నా, ఆ తర్వాత ఆలోచన మార్చుకున్నారు.

జనసేన పార్టీ తరఫున పోరాట యాత్ర చేపట్టి, మధ్యలో ‘కవాతు’ పేరుతో హంగామా చేస్తూ వచ్చారు పవన్‌కళ్యాణ్‌.కొన్ని రోజులపాటు ఈ హంగామా నడిచింది.దాంతో, జనసేనాని ట్రాక్‌లోకి వచ్చేసినట్లేనని ఆయన అభిమానులు అనుకున్నారు.ఇంతలోనే మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ ‘రెస్ట్‌’ తీసుకోవడం వైపు మొగ్గు చూపారు.

అసలే ఎన్నికలు చూసుకుంటే… దగ్గరకు వచ్చేస్తున్నాయి.

జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పార్టీ నియామకాలే ఇంకా జరగలేదు.

కనీసం నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు.బూత్‌ లెవల్‌ కమిటీలు ఏవీ ఏర్పాటు చెయ్యలేదు.ఎన్నికలంటే.175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసేస్తుందని ప్రకటించడం పెద్ద విషయం కాదు.కానీ, పోటీ నిలబడాలంటే దానికోసం చాలా చాలా కష్టపడాలి.వీటన్నిటిని కాసేపు పక్కనపడితే ఇటీవల విడుదల అయినా ఓ సర్వేలో జనసేన కి అట్టడుగు స్థానం రావడం ఆ పార్టీ నాయకులు .అభిమానుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది.కానీ పవన్ మాత్రం వీటన్నిటిని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube