పవన్ ప్రకటనతో 'తికమక' లో కమ్యునిస్టులు..!   Pawan Kalyan Janasena Conforms About Tie Ups With The AP Parties     2018-10-30   10:43:52  IST  Surya

నాకొంచం తిక్క ఉంది దానికో లెక్క ఉంది అంటూ సినిమా డైలాగులు ఎంతో అద్భుతంగా పేల్చే పవన్ కళ్యాణ్ కి నిజంగానే తిక్క ఉందనే పరిస్థితికి వచ్చేశారు అభిమానులు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక తికమక పడిపోతున్నారు జనసేన కార్యకర్తలు , అభిమానులు. ఒక సారి మాట్లాడిన మాటలు మరో సారి మీటింగ్ లో మారిపోతాయి..ఒకటి అనబోయి , ఒక టాపిక్ మాట్లాడబోయి ఎదో ఎదో మాట్లాడేస్తూ కలగల గంపలాగా శ్రోతలకి విసుగు పుట్టించే విధంగా పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు వింటుంటే కడుపులో ఎదో తిప్పుతున్న ఫీలింగ్ సరే ఇదంతా ఎప్పుడూ ఉండేదే అసలు విషయంలోకి వెళ్తే.

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అభిమానులకి ఎంత షాక్ ఇచ్చిందో తెలియదు కాని జనసేన పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగాలని అనుకున్న వామపక్షాలకి మాత్రం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అవసరానికి అడ్డంగా ఉపయోగించుకుని ఇప్పు తూ నా బొడ్డు అంటూ మధ్యలో వదిలేసిన పవన్ కళ్యాణ్ వైఖరిపై సీపీఐ , సీపీఎం నేతలు కస్సు బస్సు మంటున్నారు. అంతేకాదు ఎలాంటి వ్యాఖ్యల వలన మా మనోభావాలు దెబ్బ తింటున్నాయని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు కొందరు నేతలు.

అసలు ఇంతకీ ఏమయ్యింది పవన్ వామపక్ష పార్టీలకి కాలేలా ఎలాంటి ప్రకటన చేశాడు అంటే.. ట్విట్టర్ వేదికగా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పందించాడు. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వైసీపీ తో పొత్తు పెట్టుకుంటాడు లేక బీజేపీ లేక తెలుగుదేశం అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యాలు నేను ఖండిస్తున్నాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవలసిన అవసరం మాకు లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటరిగానే బరిలోకి దిగుతుందని అన్నాడు..దాంతో ఉలిక్కిపడిన ఎర్ర పార్టీ నేతల కళ్ళు ఎర్రబడ్డాయి.

Pawan Kalyan Janasena Conforms About Tie Ups With The AP Parties-

ఇంతకాలం పవన్ కళ్యాణ్ పోరాటాలు చేయాలంటూ మా సహాయం తీసుకున్నాడు కవాతు కి సైతం మేము మద్దతు తెలిపాము. ఎన్నో కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నాము. ఇప్పుడు ఒక్క సారిగా పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు..గతంలో జనసేన, మేము కలిసి పోటీ చేస్తాము అని చెప్పాము, సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ని ఎంపిక చేస్తామని చెప్పినప్పుడు ఖండిచలేదు ఇప్పుడు ఒక్కసారిగా పొత్తులు పెట్టుకోమని చెప్పడం లో ఆంతర్యం ఏమిటి అంటూ ఫైర్ అవుతున్నారట.