ఇక ఏపీలో 'పవన్ ఒంటరి పోరాటం' బీజేపీ పరిస్థితి ఏంటో ?

జనసేన పార్టీ పరిస్థితి ఏపీలో ఎటూ కాకుండా అయిపోయింది.బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత జనసేన రాజకీయంగా చాలా ఇబ్బందులకు గురవుతోంది.

 Pawan Kalyan Janasena Bjp Ap Elections-TeluguStop.com

దీనిపై పవన్ తన అసంతృప్తిని బయటకి వెళ్లగక్కలేక, తనలో దాచుకోలేక సతమతం అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో జగన్ ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా రాజకీయంగా బలపడవచ్చని పవన్ ఆలోచించారు.

అయితే కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం పవన్ సూచనలను పట్టించుకోకుండా జగన్ నిర్ణయాలకు జై కొడుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం పవన్ కు మరింత బాధ కలిగిస్తోంది.

రాజధాని విషయంలో తాను ముందు నుంచి పోరాటం చేస్తూ ముందుకు వెళ్తుంటే ఆ విషయంలో బీజేపీ మేము జోక్యం చేసుకోము అంటూ మూడు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకోండి మాకు ఏ అభ్యంతరం లేదు అంటూ వ్యాఖ్యానించడం తదితర పరిణామాలపై పవన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడట.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న మొదట్లో అమరావతి పరిసర ప్రాంత రైతుల కోసం తాను బీజేపీ పెద్దలతో మాట్లాడతానని, తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం కొనసాగిస్తాను అంటూ ప్రకటించాడు.

Telugu Ap, Atchannaidu, Balayya, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Ro

ఈ నెల పదో తేదీ తర్వాత తాను స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.రాజధాని రైతుల ఉద్యమస్ఫూర్తి చూసి తెలుగు వారంతా గర్విస్తున్నారన్నారు.రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చినా ఇప్పుడు రోడ్డున పడిన రైతులకు నేను అండగా ఉంటాను అంటూ ప్రకటించాడు.

కానీ బీజేపీ తో పొత్తు తరువాత నుంచి పవన్ ఈ విషయంలో ఎటూ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఇకపై బీజేపీ అమరావతి విషయంలో తమతో కలసివచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒంటరిగానే అమరావతి ఉద్యమంలోకి వెళ్లాలని పవన్ బలంగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అమరావతి విషయంలో పవన్ నోరెత్తకుండా చేసేందుకే పొత్తు పేరుతో ఇలా కట్టడి చేసిందనే అనుమానం ఇప్పుడు పవన్ లోనూ వ్యక్తం అవుతోంది.అందుకే తనకు ముందు అనుకున్న తేదీ ప్రకారం అమరావతి పోరాట యాత్ర చేయాలనీ పవన్ డిసైడ్ అయ్యారు.

అయితే ఈ విషయంలో పవన్ బీజేపీని సంప్రదించలేదని, సంప్రదించే అవకాశం కూడా లేనట్టుగా తెలుస్తోంది.దీంతో పొత్తు విషయంలో ఈ రెండు పార్టీల వైకిరి ఎలా ఉంటుంది అనే విషయంలో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube