అకిరా నందన్ తెరంగేట్రం కోసం ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్?

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Pawan Kalyan Is Working On Karanandans Debut-TeluguStop.com

అంతేకాకుండా రాజకీయపరంగా జనసేన పార్టీని స్థాపించాడు.ఇక గతంలో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే త్వరలోనే తన కుమారుడు అకీరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.

 Pawan Kalyan Is Working On Karanandans Debut-అకిరా నందన్ తెరంగేట్రం కోసం ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్, సినీ నటి రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ గురించి అందరికీ పరిచయమే.2004లో జన్మించిన అకీరానందన్ ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ పరిచయం చేయలేదు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ గతంలో అకీరా ఫోటోలు పంచుకోగా.

అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని పవన్ అభిమానులు తెగ ప్రశ్నలు వేశారు.ఇండస్ట్రీలో ఇప్పుడు అకీరా ఎంట్రీ ఉండదని రేణు దేశాయ్ చెప్పేసింది.కానీ త్వరలోనే అభిమానుల కోరిక తీరనున్నట్లు తెలుస్తుంది.

అకీరానందన్ త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అందుకు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు అకీరా ఎంట్రీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.అంతేకాకుండా తన ఎంట్రీ కోసం డాన్స్, సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నాడట.

చదువులన్ని పూర్తయిన తర్వాత నటన మీద శిక్షణ కోసం అమెరికాకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్.

తన మొదటి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా కే జి ఎఫ్ నిర్మాతలు కూడా పవన్ తో ఒప్పందం చేసుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.ఈ విషయం గురించి పవన్, రేణు దేశాయ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రమేష్ వర్మ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా వరుస సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

#Pawan Kalyan #Karanandan #Ranu Desai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు