చిరంజీవి - పవన్ అభిమానులకు శుభవార్త     2017-01-01   01:20:48  IST  Raghu V

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మెగా ఫ్యామిలి ఫంక్షన్ కి హాజరయ్యి ఏళ్ళు గడిచిపోయాయి. మెగా ఫ్యామిలి నుంచి ఏ కొత్త సినిమా వస్తున్నా, ప్రతీ సినిమా ఫంక్షన్ కి ముందు పవన్ వస్తున్నాడా లేదా అనే చర్చ జరగటం ఖాయం. ఈసారి కూడా అంతే. మెగాస్టార్ 150వ సినిమా ఫంక్షన్ కి పవన్ వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంత బలంగా కోరుకుంటున్నారంటే, అలాంటి జరగటం కోసం పూజలు, పునస్కారాలు చేయటమే తక్కువ.

అయితే, మెగా అభిమానులు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఖైదీ నం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నాడు. పవన్ లేనిదే ఫంక్షన్ లేదని, రామ్ చరణ్ మొండి పట్టు పట్టడంతో, పవర్ స్టార్ సరే అనక తప్పలేదు అంట.

ఇక ఫంక్షన్ జనవరి 4వ తేదిన విజయవాడలో జరుగుతుందా లేక జనవరి 7వ తేదిన గుంటూరులో జరుగుతుందా అనే విషయం మీద కొంచెం క్లారిటి మిస్ అయ్యింది. జనవరి 4న, విజయవాడలో జరిగే అవకాశాలే ఎక్కువ అనుకోండి.

అయినా, తేది మారితే ఏంటి, వేదిక మారితే ఏంటి, మారకపోతే ఏంటి .. మెగా ఫ్యాన్స్ కి కావాల్సింది మెగా బ్రదర్స్‌ ని వేడుకలో చూడటం. అది జరగబోతోంది.