ఆ సమయంలో పవన్‌ నన్ను బలవంతంగా ఒప్పించాడు : రేణుదేశాయ్‌   Pawan Kalyan Is Reason For Renu Desai To Do The Johnny Movie     2018-10-25   08:54:56  IST  Ramesh P

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ చాలా సంవత్సరాల క్రితమే ఆయన నుండి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరు పిల్లలయిన తర్వాత విడాకులు తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ ఆ తర్వాత కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. పిల్లల కోసం తరచు కలుస్తూనే ఉన్న వీరిద్దరు ప్రస్తుతం తమతమ సొంత జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ మరో పెళ్లి చేసుకోగా, రేణుదేశాయ్‌ ఇటీవలే తన స్నేహితుడితో వివాహంకు సిద్దం అయ్యింది. నిశ్చితార్థం చేసుకున్న రేణు త్వరలో పెళ్లి పీఠు ఎక్కబోతుంది. పవన్‌ నుండి దూరంగా ఉంటున్నా కూడా ఆయన జ్ఞాపకాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్‌ నెమరేసుకుంటూనే ఉంటుంది.

రేణు వివాహ నిశ్చితార్థం తర్వాత పవన్‌ గురించి కాస్త తక్కువ మాట్లాడుతుంది. తాజాగా పవన్‌తో తాను నటించిన జానీ చిత్రం జ్ఞాపకాలను నెమరేసుకుంది. బద్రి చిత్రం సమయంలో పవన్‌తో ప్రేమలో పడ్డ రేణు, ఆ తర్వాత ఆయనతో సహజీవనం సాగిస్తుంది. అందరికి తెలిసే ఇద్దరు సహజీవనం సాగించారు. ఆ సమయంలోనే పవన్‌ జానీ సినిమాకు కమిట్‌ అయ్యాడు. నాకు ఆ సినిమా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన పని అదే అవ్వడంతో చాలా సంతోషించాను. సినిమాకు సంబంధించిన అన్ని చర్చల్లో పాల్గొన్నాను. షూటింగ్‌ సమయంలో అన్ని విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేదాన్ని.

Pawan Kalyan Is Reason For Renu Desai To Do The Johnny Movie-

సినిమాలో హీరోయిన్‌గా నన్నే ఎంపిక చేసినట్లుగా పవన్‌ చెప్పాడు. ఆసమయంలో నేను షాక్‌ అయ్యాను. నాకు హీరోయిన్‌గా ఆసక్తి లేదు. నేను కేవలం ప్రొడక్షన్‌ మేనేజర్‌గా వర్క్‌ చేస్తానంటూ తేల్చి చెప్పాను. కాని వేరే హీరోయిన్‌తో నటించే ఆసక్తి తనకు లేదని, నీవు నటించాల్సిందే అంటూ ఆ సమయంలో పవన్‌ నన్ను ఒత్తిడి చేశాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్‌గా ఒప్పుకున్నాను. అయితే హీరోయిన్‌గా ఎంపికైనంత మాత్రాన ప్రొడక్షన్‌ మేనేజర్‌ పనిని వదిలి పెట్టలేదు. రోజుకు 15 నుండి 17 గంటల పాటు వర్క్‌ చేసేదాన్ని. దాదాపు ఏడు నెలల పాటు ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి జ్ఞాపకాలను నెమరేసుకుంది.