పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడు కాదు     2017-01-03   22:20:35  IST  Raghu V

మీరే గనుక పవర్ స్టార్ వీరాభిమాని అయితే మమ్మల్ని తిట్టుకోకండి. ఈ మాట అన్నది ఎవరో కాదు, మెగాఫ్యామిలి వారసుడు, పవన్ కళ్యాణ్ సొంత మనిషి రామ్ చరణ్. అయితే, ఈ మాటను చాలామంది వక్రీకరిస్తున్నారు. చరణ్ పవన్ ని ఏం వెక్కిరించి మాట్లాడలేదు. సందర్భం అలాంటిది.

నిన్న ఫేస్ బుక్ చాట్ లో అభిమానులతో మాట్లాడాడు చరణ్. అందులో పవన్ ఖైదీనం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వస్తున్నాడా లేదా అనే ప్రశ్నకు బదులిస్తూ, పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడు కాదు పిలవడానికి, ఆయనకి ఆహ్వానం ఇవ్వడం నా బాధ్యత. వెళ్ళి కలుస్తున్నాను. రావడం రాకపోవడం ఆయన ఇష్టం అంటూ చరణ్ సరదాగానే జవాబు చెప్పాడు.

దీనికే పవన్ అభిమానులు నొచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు చిన్నపిల్లాడు అనే పదాన్ని చరణ్ ఎలా ఉపయోగిస్తాడని అని గోలగోలా చేస్తున్నారు.