ఆ కులమే టార్గెట్ గా జనసేన కీలక నిర్ణయం ?

రాజకీయంగా జనసేన పార్టీని స్థాపించి జాగ్రత్తగా రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటే వెళ్తే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు అన్నది ఆ పార్టీ లో ఏర్పడిన అభిప్రాయం.అయితే సొంతంగా అధికారంలోకి రాలేక పోయినా,  ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కీలకంగా మారాలి అనే ఉద్దేశం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో కనిపిస్తోంది.

 Pawan Kalyan Is Going To Hold Meetings To Give Priority To The Kapu Caste Janase-TeluguStop.com

కనీసం 40 కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తామే కీలకంగా మారతాము అని , అప్పుడు అనేక షరతులు విధించి తమ రాజకీయ ఎత్తుగడలను అమలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో పవన్ ఉన్నట్టు కనిపిస్తున్నారు.అందుకే గత కొద్ది రోజులుగా పార్టీ తరఫున యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు.

     ఇదిలా ఉంటే పవన్ తన సొంత సామాజిక వర్గం నాయకులు అందరినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఏపీలో తీవ్ర ప్రభావం చూపించగలిగే స్థాయిలు కాపు సామాజిక వర్గం ఉన్నా,  అధికారానికి మాత్రం దూరంగా ఉండడం  వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .దీనిలో భాగంగానే జిల్లాల వారీగా కాపులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జనసేన నిర్ణయించుకుంది.అయితే పవన్ స్వయంగా ఈ కార్యక్రమాలకు హాజరు అయితే ఆయనపై కుల ముద్ర పడుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ సమావేశాలకు హాజరు కాకుండా కేవలం వీడియో సందేశం ద్వారా తన గొంతు వినిపించే ప్రయత్నం చేయబోతున్నారు .
     

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan-Telugu Polit

   ఇక పవన్ సోదరుడు జనసేన నాయకుడు నాగబాబు మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడంతో పాటు , లీడ్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.కాపు రిజర్వేషన్ అంశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది.కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ తో గతంలో అనేక ఉద్యమాలు నడిచినా, చివరకు అది సాధ్యం కాలేదు.దీంతో జనసేన అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్ అమలయ్యేలా చూస్తామనే  విషయాన్ని సమావేశాల్లో ప్రస్తావించి కాపుల అందరిలోనూ కదలిక వచ్చేలా చేయాలని,  తద్వారా పూర్తిస్థాయిలో జనసేన కి కాపుల అండ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేసుకుంటోంది.

టిడిపి జనసేన పొత్తు విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే జనసేన ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube