పవన్ కు మరో ఆప్షన్ లేదు ! అవకాశం కోల్పోయారు గా ? 

ఈ రాజకీయ చదరంగంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.ఏడేళ్లుగా జనసేన ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం గా పవన్ ముందుకు వెళ్తున్నారు.

 Pawan Kalyan Is Facing Political Difficulties, Ap, Ap Cm, Bjp, Cbn, Jagan, Janas-TeluguStop.com

అయితే సొంతంగా అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయంతో వివిధ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు.టిడిపి, బిజెపి , సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఇలా అన్ని పార్టీల్లోనూ పొత్తు పెట్టుకోవడం , మళ్ళీ వాటికి దూరం అవ్వడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతానికి బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.జాతీయ పార్టీగా ఉన్న బిజెపి అండదండలు ఉంటే అధికారంలోకి రావచ్చనే అభిప్రాయపడడం తోనే ఆ పార్టీతో కొనసాగుతున్నారు.

అయితే బిజెపి జనసేన కు సహకరించడం, జనసేన బిజెపికి సహకరించడం వంటి విషయాల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.మొదట్లో పవన్ ను పట్టించుకోనట్లు గా బిజెపి వ్యవహరించింది.

అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే అనుమానం కూడా అందరిలోనూ తలెత్తింది.కానీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఈ సమయంలో అకస్మాత్తుగా  పవన్ ప్రాధాన్యం బిజెపి పెంచింది.

తమ రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి అని ప్రకటించింది.బిజెపి జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు వరకు అంత పవన్ ను కీర్తిస్తూ తిరుపతి ఎన్నికల ప్రచారంలో లబ్ధిపొందాలని చూశారు .అయితే పవన్ మాత్రం బిజెపి  తరఫున కేవలం ఒకే ఒక్క మీటింగ్ పెట్టి సరిపెట్టారు.పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు.

అదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిందని హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు.దీంతో బిజెపి తో కొనసాగేందుకు పవన్ కు పెద్దగా ఆసక్తి లేదనే చర్చ ఏపీ లో మొదలైంది.

బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటే,  బీజేపీ విజయానికి కృషి చేసి ఉంటే కనీసం రాజ్యసభ సభ్యత్వం అయినా పవన్ కు దక్కేది.కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా కోల్పోయారు.

Telugu Ap Cm, Jagan, Janasena, Janasenani, Lokesh, Tirupathi-Telugu Political Ne

 అసలు బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టం లేదన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్నారు.ఈ తరుణంలో పవన్ కు మరో ఆప్షన్ తెలుగుదేశం పార్టీనే.ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నారు.కాకపోతే తాను ఏపీకి సీఎం అవ్వాలనే కోరిక తో పవన్ ఉండడంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆశ తీరదు అనే అనుమానం కూడా పవన్ కు ఉంది.

ఈ అనుమానంతోనే పవన్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube