పవన్ విషయంలో బిజెపి కన్ఫ్యూజన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే.ఆయనకున్న లక్షలాది మంది అభిమానులు, కాపు సామాజికవర్గం అండదండలు రాజకీయం గా కలిసి వచ్చేవే.2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీయడంతో పవన్ కు , ఆయన పార్టీకి పెద్దగా కలిసి రాలేదు.అయితే ఎప్పుడూ అదే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి.

 Janasena, Bjp, Tdp, Ysrcp, Ap, Somu Veerraju, Janasenani, Bjp Janasena Alliance,-TeluguStop.com

ఎందుకంటే రాజకీయంగా ఒక్కోసారి ఒక్కొక్కరి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది.యూత్ లో పవన్ కు ఉన్న పట్టు, కాపు సామాజికవర్గం అండదండలు ఇలా  ఎలా చూసుకున్నా, రాబోయే రోజుల్లో పవన్ కీలకం కాబోతున్నారు.

అయితే ఈ విషయాన్ని జనసేన తో పొత్తు పెట్టుకున్న బిజెపి అంతగా గుర్తించడంలేదో, పట్టించుకోవడం లేదోతెలియదు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Telugu Ap, Bjpjanasena, Janasena, Janasenani, Somu Veerraju, Ysrcp-Telugu Politi

ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన విషయం పెద్దగా ఆసక్తి లేనట్టుగా వ్యవహరిస్తూ వస్తుండగా, జనసేన సైతం బీజేపీని అదేవిధంగా చూస్తోంది.బిజెపి అగ్రనాయకులు తన విషయంలో సానుకూలంగా ఉన్నట్లు గా వ్యవహరిస్తున్నప్పటికీ,  తనకు ఇప్పటి వరకు కనీసం ప్రధాని నరేంద్ర మోదీ వంటివారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, 2014 ఎన్నికల సమయంలో కానీ , ఆ తర్వాత బిజెపి ప్రభుత్వంలో గానీ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా ప్రధాని కలిసేవాడిని అని, కానీ పొత్తు పెట్టుకున్న తరువాత మాత్రం ఆ అవకాశం లేకుండా పోయిందని పవన్ కు తీవ్ర అసంతృప్తి ఉంది.

 అది కాకుండా బిజెపి శ్రేణులు తమను తక్కువ చేస్తూ, విమర్శలు చేస్తున్న తీరు ని పవన్ తట్టుకోలేకపోతున్నారు.

తెలంగాణలో బిజెపికి మద్దతుగా జనసేన ఉంటుందా లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన ను ఉద్దేశించి ఆ పార్టీ మద్దతు అవసరం లేదని, అసలు తెలంగాణ తాము పెట్టుకోలేదు అంటూ మాట్లాడిన మాటలు పెద్ద వివాదమే రేపుతున్నాయి.

ఇప్పుడు తెలంగాణలోని హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారని అంతా అభిప్రాయపడుతుండగా,  పవన్ మాత్రం అస్సలు ఆసక్తి చూపించడం లేదట.ప్రస్తుతం ఏపీ విషయంలోనే తాడోపేడో తేల్చుకోవాలని,  అయితే బిజెపి లేకపోతే మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని తాను మాత్రం రాబోయే ఎన్నికల నాటికి కీలకంగా మారాలనే ది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.

Telugu Ap, Bjpjanasena, Janasena, Janasenani, Somu Veerraju, Ysrcp-Telugu Politi

 ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రస్తుతానికి ఏపీలో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదు అనేది అందరికీ తెలిసిందే.పవన్ కు ఉన్న చరిష్మా, అభిమానుల బలం ఇవన్నీ ఉపయోగించుకుని  బిజెపి ఏపీలో బలమైన పార్టీగా అవతరించే అవకాశం  ఉన్నా, దాన్ని సరైన విధంగా ఆ పార్టీ నాయకులు వాడుకోలేక పోతున్నారని, ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాల్సి ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు మిగతా పార్టీలకు వరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube