విశ్వసనీయత కోల్పోతున్న పవన్..ఇందుకేనా..???

జనసేన పార్టీ ఆవిర్భావం సమూలమైన మార్పుకి , అవినీతిని కట్టడి చేయడానికి, కులమతాలకి అతీతంగా నవసమాజం నిర్మించడానికై ఏర్పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు, పార్టీలో నేతలు అందరూ మీడియా ముందుకు వస్తే ఇలాంటి నీతి సూక్తులని వల్లే వేస్తూనే ఉంటారు.కొత్త రక్తం రావాలి పాత రక్తం పోవాలని అనుకున్న తరుణంలో నేనున్నా మార్పు తెస్తాననితన అన్న ప్రజారాజ్యం లాగానే రంగంలోకి దిగాడు.కాని

 Pawan Kalyan Is A Pure Political Minded Leader-TeluguStop.com

మార్పు తెస్తా మార్పు తెస్తానని చెప్పి చివరికి ఇప్పుడు జనసేన పార్టీని అన్న పార్టీకి అనుభందంగా నడిచే పార్టీలా మార్చి పారేస్తున్నాడు.చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటోంది జనసేన పార్టీ పరిస్థితి చూస్తుంటే.గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు భహిరంగ సభలలో జనసేనలోకి కొత్త రక్తం వస్తుంది.మేధావులు, యువతకే ఎక్కువగా జనసేన ప్రాధాన్యత ఇస్తుంది జంపింగ్ నేతలకి జనసేనలో చోటే లేదు అంటూ ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు.

కాని అవన్నీ

నీటి మూటలుగా మిగిలిపోయాయి తప్ప జనసేన ఆశయాలకి దగ్గరగా లేవని టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే ఎంతో మంది పార్టీలో ఉన్న అభిమానులు సైతం ఈ విషయంపై పెదవి విరుస్తున్నారు.

ముఖ్యంగా ఇతర పార్టీల నుంచీ వస్తున్న సీనియర్ నేతలకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడం అభిమానులని నిరాశకి గురిచేస్తోంది.అంతేకాదు.పార్టీలో లుకలుకలు మొదలయ్యేలా చేస్తోందట.అయినా అవేమి పట్టనట్టుగా పవన్ కళ్యాణ్ జంపింగ్ లని ప్రోత్సహించడంతో పార్టీలో సైతం అసమ్మతి రాగం వినిపిస్తోందని అంటున్నారు.ఇదిలాఉంటే

తాజాగా ఉత్తరాంధ్ర నుంచీ దాడి వీరభద్రరావు ఇప్పుడు జనసేనలోకి రావాలని అనుకోవడం.అందుకు పవన్ నుంచీ సానుకూలంగా స్పందన రావడంతో పవన్ పై విసుగేత్త్తి పోతున్నారట పార్టీ నేతలు.

దాడి మొదట్లో టీడీపీ సీనియర్ గా ఉంటూ ఆ తరువాత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీలో చేరారు.ఇప్పుడు ఆ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉండటంతో జనసేన వైపుగా మంతనాలు చేస్తున్నారని.

ఇప్పుడు ఈ పరిస్థితే పార్టీలో కొదరు నేతలకి నచ్చడంలేడనే టాక్ వినిపిస్తోంది.

దాంతో పవన్ చెప్తోంది ఒకటి చేస్తోంది మరొకటి,ఇప్పటికే పార్టీని పక్క పార్టీల నేతలతో నింపేశారు.మరిన్ని చేరికలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇలా అయితే కొత్త వారికి అవకాసం ఇస్తారా.?? ఇచ్చిన మాటని నిలబెట్టుకోరా అంటూ సొంత పార్టీలోనే ప్రశ్నలు లేవనేత్తుతున్నారు…మరి పవన్ ఇదే తరహాలో అడుగులు వేస్తే భవిష్యత్తులో ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube