మల్టీస్టారర్ మూవీ సీక్వెల్‌కు ఓకే చెప్పిన పవన్..?  

Pawan Kalyan Interested For Gopala Gopala Sequel - Telugu Dolly, Gopala Gopala, Oh My God 2, Pawan Kalyan, Sequel, Venkatesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఆ తరువాత డైరెక్టర్ క్రిష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.

Pawan Kalyan Interested For Gopala Gopala Sequel - Telugu Dolly, Gopala Gopala, Oh My God 2, Pawan Kalyan, Sequel, Venkatesh-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలే కాకుండా పవన్ మరికొన్ని సినిమాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఓ స్క్రిప్టు రెడీ చేయాల్సిందిగా ఆయన కోరినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా మరో డైరెక్టర్ డాలీని కూడా ఆయన ఓ సినిమా స్క్రిప్టును రెడీ చేయాలని కోరాడట.గతంలో డాలీతో కలిసి విక్టరీ వెంకటేష్‌తో పవన్ చేసిన గోపాల గోపాల చిత్రం అందరికీ తెలిసిందే.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేయాలని పవన్ కోరాడట.

బాలీవుడ్‌లో ఓ మై గాడ్-2 అనే సీక్వెల్ కథ కూడా ఉండటం, గోపాల గోపాల చిత్రం పవన్‌కు చాలా బాగా నచ్చడంతో ఈ సీక్వెల్‌ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారట.

మరి డాలీ పవన్ కోసం గోపాల గోపాల చిత్రం సీక్వెల్‌ను రెడీ చేస్తాడా లేడా అనేది చూడాలి.

తాజా వార్తలు