పరోక్షంగా పార్టీ అభ్యర్దులకి చురకలు పెట్టిన పవన్ కళ్యాణ్! కారణం అదేనా  

జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించిన పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Interact With Janasena Party Mla And Mp Candidates-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్ధుల నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంది అనే విషయాలని అడిగి తెలుసుకున్నారు. తరువాత పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు..

పరోక్షంగా పార్టీ అభ్యర్దులకి చురకలు పెట్టిన పవన్ కళ్యాణ్! కారణం అదేనా-Pawan Kalyan Interact With Janasena Party MLA And MP Candidates

ప్రజారాజ్యం పార్టీ సమయంలో నాయకులంతా ఆశతో వచ్చారని, ఇప్పుడు మాత్రం అందరూ ఆశయంతో వచ్చారని అన్నారు. జనసేన పార్టీ ప్రజల తరుపున పోరాటం చేయడానికి, భవిష్యత్తు రాజకీయాలలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో మొదలెట్టింది అని అన్నారు.ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓడిపోతామనే భయం, ఫలితం ఎలా ఉంటుంది అనెన్ టెన్షన్ తమకి లేవని తేల్చి చెప్పిన జనసేనాని ఎమ్మెల్యే అభ్యర్ధులని ఉద్దేశించి మాట్లాడుతూ గెలిచినా తర్వాత పార్టీకి నమ్మక ద్రోహం చేయాలనే అనుకుంటే తమకి తాము ద్రోహం చేసుకున్నట్లే అని, అలాంటి వారిని జనసేన భవిష్యత్తులో క్షమించే అవకాశం అస్సలు ఉండదని తేల్చి చెప్పేశారు.

ఈ మాటలు చెప్పడానికి కారణం గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాలలో జనసేన పార్టీ గెలుపు గుర్రాలు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్నా నేపధ్యంలో చేసినవే అని తెలుస్తుంది. ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వకపోయినా గెలిచినా, ఓడినా పార్టీ ప్రజల మధ్యనే ఉంటుంది అని స్పష్టం చేసారు అని చెప్పాలి.