పవన్ వ్యూహాత్మక ప్రసంగం..రేణూ నుంచీ తప్పించుకోవడానికేనా       2018-07-09   02:15:02  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ జనసేన ప్రారంభించిన నాటినుంచీ నిన్నటి వరకూ కూడా రాజకీయాలలో తన కుటుంభానికి జనసేన కి సంభంధం లేదు అని చెప్తూ వచ్చాడు…ఎప్ప్దుడు కూడా జనసేనలో ఫ్యామిలీ డ్రామా నడవలేదు అయితే పవన్ ఇప్పుడు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు..తనపై జరిగే దాడి నుంచీ తప్పించుకోవడానికి ముందుగానే పవన పక్కా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు..అందులో భాగంగానే ఎప్పుడో సమసి పోయిన తన అన్న కూతురు శ్రీజ గొడవని మళ్ళీ వెలుగులోకి తెచ్చాడు..

విశాఖలో జరిగిన కవాతు కార్యక్రమంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం స్థాపించాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తమపై జరిపిన దాడిని గురించి పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు..తన అన్న చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొనలేక…శ్రీజను అడ్డు పెట్టుకున్నారని పవన్ మండిపడ్డారు. శ్రీజ ప్రేమ పెళ్లిని రాజకీయం చేసి తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు..ఆ సమయంలో నేను ఎంతో రోధించానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

నన్ను…చిరంజీవి గారి లాంటి వ్యక్తులను కూడా కాంగ్రెస్ నాయకులు ఆసమయంలో ఎన్నో ఇబ్బందులకి గురిచేశారు..ఒక పదహారేళ్ల అమ్మాయి చిరంజీవి గారి కూతురిని మోసం చేసి ఢిల్లీ వరకూ తీసుకుని వెళ్లి రిలే షో చేశారు అంటూ మండిపడ్డారు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా ఆడపడుచులు లేరా అంటూ మండిపడ్డారు మీ రాజకీయాల వల్ల మా కుటుంభం అంతా ఎంతో భాదపడింది అంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు..

అయితే పవన్ ఎప్పుడో జరిగిన గాయానికి మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకువచ్చారని ఆలోచించిస్తే అసలు విషయం భోదపడింది..అసలు మ్యాటర్ ఏమిటంటే..గత కొన్ని రోజులుగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ పై దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తోంది..ఈ వ్యాఖ్యలు చూస్తుంటే పవన్ కి రాజకీయంగా భారీ దెబ్బ పడటం ఖాయం గా కనిపించడంతో పవన్ ఈ వ్యూహాత్మక ప్రసంగం చేశారు..

ముందస్తు చర్యగా పవన్ తెలుగుదేశం పార్టీనే రేణూ తో ఈ వ్యాఖ్యలు చేయిస్తోంది అన్నట్టుగా ప్రజలకి తెలుపడానికి శ్రీజ ఇష్యూ ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చాడు అని అంటున్నారు..తన అన్నని ఎదుర్కొవడానికి ఎలా అయితే శ్రీజ ఇష్యూ ని వాడుకున్నారో ఇప్పుడు నన్ను ఎదుర్కోవడానికి రేణూ ఇష్యూ బయటకి తీసుకోవచ్చారనేది పవన్ మాటలబట్టి అర్థం అవుతోంది…మరి ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు తెరపైకి వస్తాయో వేచి చూడాలిసిందే అంటున్నారు విశ్లేషకులు.