కెసిఆర్ కంటే నేనేమి తక్కువ అంటూ అలిగి వెళ్ళిపోయిన పవన్     2017-09-24   23:52:31  IST  Raghu V

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చాలు. సినిమా ఎలాంటిది, దర్శకుడు ఎవరు, ట్రేడ్ ఏరియా ఏమిటి, అనే తేడా లేకుండా థియేటర్స్ ముందు పడిగాపులు కాస్తుంటారు ఆడియెన్స్. అభిమానులకి పవన్ కళ్యాణ్ దేవుడి కన్నా తక్కువేమీ కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ ని అవమానించారు ఓ పెద్ద మనిషి. ఆయనే NTV ఓనర్ నరేంద్ర చౌదరి. నిన్న ఆయన కూతురు రచన పెళ్ళి కోస్టల్ గ్రూప్ అధినేత సబ్బినేని సురేంద్ర కుమారుడు విష్ణు తేజతో శంషాబాద్ పరిసరాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళి ఖర్చు ఎంత లేదన్న 50 కోట్లకు అటుఇటుగా ఉంటుందని టాక్.

ఆ భారి వివాహ వేడుకకి బడాబాబులు చాలామందే వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రపదేశ్ సియం చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, రేణుక చౌదరి, GVK లాంటి వారు అతిథుల లిస్టులో ఉన్నారు. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నప్పటికీ, వివాహ వేడుకలో అలిగి పవన్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

అసలేం జరిగింది అంటే, సరిగ్గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే కెసిఆర్ కూడా వేదిక వద్దకు వచ్చారట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికీ మొదటి ప్రాధాన్యతనివ్వాలి? ఎవరికీ ముందుగా అతిధి మర్యాదలు చేయాలి? ఎంత పెద్ద సినిమా స్టార్ అయినా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే అడ్జస్ట్ చేసుకోక తప్పదు కదా. కాని తనకున్న ముందుగా కెసిఆర్ కి ప్రాధాన్యతనివ్వడం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదట. అదీకాక, కెసిఆర్ పట్టింపులో పడి తన సంగతి దాదాపుగా మరచిపోయినంత పని చేసారట. దాంతో చిర్రెత్తుకొచ్చి పవన్ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.