మెగా బర్త్‌ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడా?

మెగా స్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు హైదరాబాద్ హైటెక్స్ లో భారీ వేడుక నిర్వహించబోతున్న విషయం తెల్సిందే.అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా నాగబాబు పర్వవేక్షిస్తున్నాడు.

 Pawan Kalyan In Chiranjeevi Birthday Celebrations ,pawan Kalyan ,chiranjeevi , Chiranjeevi Birthday Celebrations, Mega Fans ,naga Babu-TeluguStop.com

చిరంజీవి బర్త్‌ డే వేడుకలు అవ్వడం వల్ల మెగా ఫ్యామిలీకి చెందిన అందుబాటులో ఉన్న హీరోలు దాదాపు అంతా కూడా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు ఈ బర్త్‌ డే వేడుకల్లో పాల్గొంటే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏపీలో ఉన్నాడు.అయినా కూడా కార్యక్రమం సమయంకు హైదరాబాద్‌ కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 Pawan Kalyan In Chiranjeevi Birthday Celebrations ,pawan Kalyan ,chiranjeevi , Chiranjeevi Birthday Celebrations, Mega Fans ,Naga Babu-మెగా బర్త్‌ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా బ్రదర్‌ నాగ బాబు మరియు ఇతర మెగా హీరోలు మాత్రం పక్కాగా హాజరు అవ్వబోతున్నారు.

చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు పుట్టిన రోజున ఒకే వేదిక మీద కలుస్తారు అని సమాచారం అందుతోంది.

అది ఏవిధంగా అనేది మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.బర్త్‌ డే వేడుకల్లో భాగంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు ఆహ్వానాలను మెగా ఫ్యాన్స్ అందించారని మాత్రం తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్ తన బర్త్‌ డే వేడుకలకు మాత్రమే కాకుండా ఇతరుల బర్త్‌ డే వేడుకలకు కూడా దూరంగా ఉంటాడు.కనుక ఈ భారీ మెగా వేడుక లో పవన్‌ ఎంత వరకు పాల్గొంటాడు అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి మరియు నాగబాబు కోరితే పవన్‌ కాదనకుండా వస్తాడు.మరి ఆ ఇద్దరు పవన్ ను రమ్మని ఆహ్వానించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్ లకే సరిగా హాజరు అవ్వడం లేదు.ఈ మెగా వేడుకలో హాజరు అయ్యేనా అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube