"పవన్ ఫ్యాన్స్" కు "సర్ ప్రయిజ్"

నితిన్ హీరోగా నటిస్తున్న “చిన్న దాన నీకోసం” చిత్రం ఈ శుక్రవారం ప్రజల ముందుకు రానుంది.అయితే ఇప్పటికే తన సినిమా ఆడియో వేడుకకు పవన్ ను ఆహ్వానించిన నితిన్ విన్నపాన్ని పవన్ సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే.

 Nitin Surprise For Pawan Fans-TeluguStop.com

అయితే అదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో పవన్ ఫ్యాన్స్ కు ఒక సర్ ప్రయిజ్ ఉంది అన్న టాక్ టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తుంది.కొందరు ఏకంగా పవన్ ఈ చిత్రంలో తళుక్కున మెరవనున్నాడు అని అంటుంటే.

మరి కొందరు నితిన్ పవన్ లగా మాస్క్ పెట్టుకుని నటిస్తాడు అని సైతం చెబుతున్నారు.ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ ఒక పక్క పవన్ కు నితిన్ వీరాభిమాని కాగా, మరో పక్క దర్శకుడు కరుణాకరన్ పవన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతుంది.

ఇక ఈ వారం చివర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం యొక్క ఇన్‌సైడ్ టాక్ మాత్రం ఒకింత మిక్స్డ్ గా వినిపిస్తుంది.మొదటి భాగం ఆధ్యంతం ఎంటర్‌టేన్‌మెంట్ తో దూసుకుపోగా, రెండో భాగా ఒకింత స్లో గా, కొన్ని అనుకోని ట్విస్ట్స్ తో సాగి.

పోతుంది అని తెలుస్తుంది.మరి ఏది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube