వైసీపీని ఇరుకున పెట్టేందుకు స‌రికొత్త వ్యూహం అమ‌లు చేస్తున్న ప‌వ‌న్‌..

ఏపీలో ఇప్పుడు జ‌న‌సేన‌కు వైసీపీకి న‌డుమ త‌గ్గ‌పోరు న‌డుస్తోంది.మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తోనే వైసీపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నడుమ వార్ ముదిరిపోయింది.

 Pawan Kalyan Implementing A New Strategy To Narrow Down The Ycp, Ycp, Pawan Kaly-TeluguStop.com

ఆయ‌న్ను మంత్రుల ద‌గ్గ‌రి నుంచి చిన్న స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు అంద‌రూ ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ చెడా మ‌డా విమ‌ర్శించేశారు.కాగా ఈ విష‌యంలో జ‌న‌సేన కూడా చాలా సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దాంతో వైసీపీకి జ‌న‌సేన‌కు న‌డుమ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంత‌లా వార్ న‌డిచిందో అంద‌రం చూస్తూనే ఉన్నాం.ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే ప‌వ‌న్ వేసిన స్రెచ్‌లో వైసీపీ ప‌డిపోయింద‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ కావాల‌నే వైసీపీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో విమ‌ర్శ‌లు చేయించుకుని ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన నేత‌గా ముద్ర వేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.ఎందుకంటే పవన్ క‌ల్యాణ్ ఒక్కరే వైసీపీని విమ‌ర్శిస్తే ప్రభుత్వంలో ఉన్న అంత‌మంది క‌లిసి ఒక్క ప‌వ‌న్‌మీద విరుచుక‌ప‌డ‌టం ప‌వ‌న్‌కు ఇటు ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

అంద‌రూ క‌లిసి ఒక్క‌డిపై దాడి చేస్తున్నార‌నే సానుభూతి కూడా బాగానే క‌లిసి వ‌స్తోంది.ఇక మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన శ్రమదానం విష‌యంలో కూడా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌వ‌న్‌కు బాగానే క‌లిసి వ‌చ్చింది.

Telugu Ap, Cm Jagan, Janasena, Janasenani, Pawan Kalyan, Pawankalyan-Telugu Poli

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మ‌రో విధంగా వైసీపీ మీద వ్య‌తిరేక‌త‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు ప‌వ‌న్ క‌ల్యాన్‌.మొన్న‌టికి మొన్న రోడ్ల మ‌ర‌మ్మ‌తుల విష‌యంలో ప్ర‌శ్నించిన ప‌వ‌న్ ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌ను క‌లుపుకుని పోయి జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు.ప్ర‌స్తుతం ఏపీలో అప్పుల భారం ఎక్కువ‌యింది.దీంతో అటు ఉద్యోగులకు కూడా జీతాలు టైమ్ కు ఇవ్వ‌ట్లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.దీన్ని ఆధారంగా చేసుకుని ‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం’ అనే అంశం మీద రౌండ్ టేబుల్ మీటింగ్‌ను అరేంజ్ చేస్తోంది.ఇందులో రాష్ట్రంలో ఉన్న మేధావులతో పాటు కొంద‌రు ప్ర‌తిప‌క్ష‌లాకు చెందిన వారు కూడా పాల్గొంటార‌ని స‌మాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube