చొక్కాపట్టుకుని లాగుతా .. పవన్ సంచలన వ్యాఖ్యలు.       2018-06-28   00:35:53  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉత్తరాంధ్ర పై మక్కువ ఎక్కువ అవుతోంది..మొదటినుంచీ కూడా పవన్ అక్కడి వారిపై శ్రద్ధ చూపడానికి అసలు కారణం పాలకులు ఉత్తరాంధ్ర ని విస్మరించడమే..ఉత్తరాంధ్రలో ఉన్న ఎంతో విలువైన సంపదకోసం అక్కడి ప్రజలని నిర్లక్ష్యమ చేస్తున్నారని..పవన్ కళ్యాణ్ అధికార పార్టీ తెలుగుదేశం పై విమర్శలు తీవ్రతరం చేశారు..ఎంతో మంది రైతులు పొలాలని వదిలేసి వలస కూలీలుగా వెళ్లిపోతుంటే ఏమి చేయకుండా నిమ్మకి నీరెత్తి నట్టుగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే వారికి ఆ పరిస్థితిని కల్పిస్తోందని ఆరోపణలు చేశారు..

పచ్చటి భూములు..పుష్కలమైన జల వనరులు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తమ స్వార్ధం కోసం పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని..ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సహజ వనరులు, గనులపై కొందరి దృష్టిపడిందనీ..ఇప్పుడు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..అందులో భాగంగానే ఇక్కడ బ్రతకలేని పరిస్థితిలు కల్పిస్తున్నారని అన్నారు..మేధావుల కోపానికి కూడా కారణం ఇదేనని అన్నారు.

టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తే ఉత్తరాంధ్ర కి అండగా నిలబడుతారు అని గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చా కానీ వారు ఏకంగా లక్ష ఎకరాలను కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

నేను మద్దతు ఇచ్చిన ప్రజా క్షేమం కోసం మాత్రమే వారు దోచుకోవడానికి కాదు అవసరం అయితే వారి చొక్కా పట్టుకుని బయటకి లాగుతా అని చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు..అయితే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకోసం సంచలన హామీలు ప్రకటించారు కూడా 2019లో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన కూలీలకు ఇక్కడే హెక్టార్ భూమి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాను..వారికోసం అవసరమైతే భూమి కొనుగోలు చేసి ఇస్తాం. వలస రాజకీయ నేతలకు కాకుండా స్థానిక నాయకులకే టిక్కెట్ ఇస్తాను అంటూ వారాల జల్లు కురిపించారు..

అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతీ అక్షరం కూడా తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత తీసుకువచ్చేలా ఉంది.అందులోనూ పవన్ మాట్లాడిన ప్రతీ మాట కూడా వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉన్నాయి..ఇప్పటికీ భార్యా పిల్లల్ని వదిలేసి ఎంతో మంది ఉత్తరాంధ్ర వాసులు చెన్నై ,ముంబై వంటి రాష్ట్రాలకి వలస కూలీలుగా వెళ్ళడం పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాలని చెప్తూ వారిపై వరాలు కురిపించడం తో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలు ఒకరినొకరు తిట్టుకుంటూ పాలనని పడకేక్కించారు..వారికి కావాల్సింది కేవలం అధికారం మాత్రమే కానీ ప్రజా సంక్షేమం కాదు ఈ విషయంలో ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పై పూర్తీ స్థాయిలో వ్యతిరేకత తో ఉన్నారు అయితే పవన్ ఈ పరిస్థితులని గుర్తించి తెలుగుదేశాన్ని ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేసి వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించాలని భావిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోంది..