ఆ విషయంలో పవన్‌ది ఐరన్ లెగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసే పనిలో ఉన్నాడు పవన్.

 Pawan Kalyan Heroines, Pawan Kalyan, Vakeel Saab, Pspk27-TeluguStop.com

కాగా ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా తెలుగమ్మాయి పూజితా పొన్నాడ ఎంపికైనట్లు తెలుస్తోంది.అయితే ఈ సందర్భంగా పవన్ సరసన నటించిన హీరోయిన్‌ల గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో పవన్ సరసన నటించిన కొందరు హీరోయిన్లు మినహా, మిగతావారు పత్తా లేకుండా పోయారు.పవన్ సరసన నటించిన కృతి కర్బందా, నిఖిషా పటేల్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్‌లో పత్తా లేకుండా పోయారు.

ఇలా పవన్ సరసన రొమాన్స్ చేయడం అంటే కెరీర్‌ను రిస్క్‌లో పెట్టడమే అవుతుందని, మరి తెలుగమ్మాయి పూజితా పొన్నాడ ఎలా తన కెరీర్‌ను మలుచుకుంటుందో చూడాలి అంటున్నారు పలువురు క్రిటిక్స్.ఇక ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూ్స్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube