ఈ ఫోటోలో ఉన్న పవన్ హీరోయిన్ ను గుర్తు పట్టారా...?

టాలీవుడ్ హీరోయిన్లలో ఎంతో మంది హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో నటించినా ఒక హీరోయిన్ మాత్రం పవన్ కు ఎప్పటికీ ప్రత్యేకం.బద్రి, జాని సినిమాల్లో పవన్ తో కలిసి నటించిన రేణు దేశాయ్ పవన్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల విడిపోయారు.

 Heroine Renu Desai Childhood Photos Viral,pawan Kalyan Heroine, Pawan Kalyan Wif-TeluguStop.com

అయితే విడిపోయిన తరువాత పెద్దగా మీడియా ముందుకు రాని రేణు దేశాయ్ గత కొంతకాలంగా యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు.

తన సంతోషాలను, బాధలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే రేణూజీ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు.

షేర్ చేసిన కొద్ది సెకన్లలోనే వైరల్ అయిన ఈ ఫోటో రేణూ దేశాయ్ దే కావడం గమనార్హం.బేబీ టైమ్… బేబీ పిక్చర్స్ అంటూ రేణు షేర్ చేసిన ఈ ఫోటోలో చిన్నప్పటి రేణు చాలా క్యూట్ గా ఉన్నారు.

గుజరాతీ అయిన రేణు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఎడిటర్ గా, నిర్మాతగా కూడా పని చేశారు.
వైరల్ అవుతున్న రేణు బాల్యానికి సంబంధించిన ఫోటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది.

కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ రేణూజీ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.గతంలో రేణు కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యలతో కారులో వెళుతున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అకీరా నందన్ సినిమాల్లోకి రావడం గురించి రేణు స్పందిస్తూ తన కొడుకు ఏ రంగంలోకి వెళతానన్నా పవన్ సపోర్ట్, తన సపోర్ట్ అకీరా కు ఫుల్ గా ఉంటుందని ఆమె వెల్లడించడం గమనార్హం.

View this post on Instagram

. Being generally happy since a while🎉

A post shared by renu desai (@renuudesai) on

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube