చేతులెత్తేసిన జనసేనాని..సూక్తులు చెప్తున్నాడే...!!!  

Pawan Kalyan Held Meeting With Young Contestants-

ఎన్నికలు అవ్వగానే ఓటింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ తాము గెలుస్తామా, ఓడిపోతామా అనే పిక్చర్ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయినా సరే మా గెలుపు తధ్యం అనే వ్యాఖ్యలు చేస్తారు ఇవన్నీ సహజమే. కానీ ఎన్నికలు అయిన సమయం మొదలు పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి విషయాలపై అసలు స్పందిచిన దాఖలాలు లేవు..

చేతులెత్తేసిన జనసేనాని..సూక్తులు చెప్తున్నాడే...!!!-Pawan Kalyan Held Meeting With Young Contestants

తమ యువ అభ్యర్ధులతో నిన్నటి రోజున మీటింగ్ ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ సభలో తమ అభ్యర్ధులతో చర్చలు జరిగిపారు. పవన్ కళ్యాణ్ తమలో జోష్ అయిన మాటలతో హుషారు నింపుతాడు అంటుకుంటూ వెళ్ళిన వారికి కొన్ని సూక్తులు చెప్తూ, కొన్ని భాద్యతలు నెత్తిమీద పెట్టడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో సదరు నేతలు ఉన్నారట

ఆదివారం రోజున మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పోలింగ్ సమయంలో వారికి ఎదురైన అనుభవాలు అడిగి తెలుసుకున్నారు.

రాజకీయాల్లో మార్పు మొదలయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలు పెట్టారట. వైసీపీ , టీడీపీలు ఎవడి డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ మన డప్పు మనం కొట్టుకోము మనం అంతా వెరైటీ అంటూ బోధించారట.

మార్పు అనేది చిన్నగానే మొదలవుతుంది, ఇది మనకి ఆరంభ దశ , ఈ మార్పు ఎంతవరకూ వెళ్తుందో నాకైతే తెలియదు అంటూ చేతులు ఎత్తేసినట్టుగా ప్రసంగించారట పవన్ కళ్యాణ్. నేను మిమ్మల్ని ఎలాగైతే గుర్తించానో అలాగే మీ మీ నియోజకవర్గాలో నాయకులని గుర్తించి వారిని ప్రోశ్చహించండి, గతంలో చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగించండి అంటూ ఆదేశించారట. నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయండి. స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటం చేయండి.

ఎవరైనా జనసేనకి వచ్చే ఓట్ల లెక్కలపై ప్రశ్నలు అడిగినప్పుడు మార్పు ఒక్కసారిగా రాదనీ చెప్పండి అంటూ హింట్ ఇచ్చారట.

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా సమావేశం అయ్యి బయటకి వచ్చిన అభ్యర్ధులుమాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుచూస్తే చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తున్నారని. మార్పు ఒక్క సారిగా రాదనీ చెప్పడంలో ఆంతర్యం ఆర్థం అయ్యిందని అంటున్నారట. అంతేకాదు నియోజకవర్గాల వారీగా నాయకులని గుర్తించమని పవన్ బాగానే చెప్పేశారు, కానీ ఎన్నికలకి ముందే అధికార పార్టీ నేతలు కొందరు జనసేన నేతలని, కార్యకర్తలని నయానో భయానో తమవైపుకి తిప్పుకున్నారని, ఇప్పుడు కొత్త నేతలని ఎక్కడినుంచీ తీసుకురావాలని మధన పడుతున్నారట.

మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా పార్టీ నుంచీ సైడ్ అయ్యి ,మళ్ళీ సినిమాలు చేస్తూ ఉంటే నేతలు మాత్రం గ్రౌండ్ లెవిల్ లో హార్డ్ వర్క్ చేయాలని చెప్పకనే చెప్పారని అంటున్నారు కొందరు నేతలు.