పర్లేదు మనకీ అవకాశం ఉంది ! జనసేనాని లో పెరిగిన ధీమా     2018-11-10   11:48:12  IST  Sai Mallula

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్ అయ్యాడు. పవన్ కి రాజకీయాలు ఏం తెలుసు అని విమర్శలు చేసినవారి నోర్లు మూతపడేలా పవన్ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. పవన్ కి ఏపీలో అంత సీన్ లేదు అని అనిపించినా … మెల్లిమెల్లిగా తన పార్టీని జనాల్లో మమేకం చేయడం లో పవన్ సక్సెస్ అయ్యాడు. జనసేన కు ఇంత ఊపు వస్తుందని పవన్ కూడా ముందు ఊహించి ఉండడు. అందుకే నేను పార్టీ పెట్టింది అధికారం కోసం కాదని , ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాను అంటూ చెబుతూ వచ్చాడు. కానీ అనుకోకుండా ఈ మధ్యకాలంలో పార్టీకి బాగా ఊపు పెరగడంతో మరి కాస్త కష్టపడితే చాలు అధికారం దక్కడం ఖాయం అనే ధీమా పవన్ లో బాగా పెరిగింది. అందుకే తన ప్రత్యర్థి పార్టీల మీద విమర్శల జోరు పెంచాడు.

Pawan Kalyan Have Chance To Win In 2019 Elections-

Pawan Kalyan Have Chance To Win In 2019 Elections

కానిస్టేబుల్ కొడుకు.. సీఎం అవకూడదా? అంటూ…. ఇటీవల ధవళేశ్వరంలో కవాతు నిర్వహించిన సందర్భంగా కూడా.. ఇదే మాట చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ మార్పు వచ్చి తీరుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం తాజాగా.. తాను సీఎం ఖాయమనే వ్యాఖ్యలు చేశారు జనసేనాని. 2019లో మనదే అధికారం అనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ధీమా ఏంటనే విషయంపైనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ – కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని సంచలనం సృష్టించాయి . వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని చెబుతూనే కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలుపుకోవడాన్ని సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అవకాశాన్ని పవన్ వాడుకోవాలనుకుంటున్నాడు.

Pawan Kalyan Have Chance To Win In 2019 Elections-

అంతే కాకుండా సమర్ధవంతమైన నాయకత్వ ఉండి సరైన అవకాశం లేకుండా రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం ఎదురుచూపులు చేస్తున్నవారిని దగ్గరకు చేర్చుకుని పార్టీకి మైలేజ్ తీసుకురావాలని పవన్ చూస్తున్నాడు. అంతే కాదు సొంతగా పోటీ చేసే లేనివారు ఇతర పార్టీల్లో అవకాశం దొరకని వారు జనసేనలో చేరి …
ఉత్సాహంగా పనిచేస్తున్నారు .

వీరితో జనసేన మరింతగా బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు అవకాశం ఇచ్చి. గెలిపించుకుంటే.. అధికారం తనదేనని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ ధీమా కారణంగానే పవన్ ఈ రేంజ్ లో స్పీడ్ పెంచడానికి కారణం గా తెలుస్తోంది. ఇక పవన్ సోదరుడు mega స్టార్ చిరంజీవి కూడా ఎన్నికల సమయం నాటికి పార్టీలో చేరి మరింత జోష్ నింపుతారని అప్పుడు పార్టీ స్పీడ్ ఇంకా పెరిగి ఎన్నికల్లో గెలుపు ఖాయం అవుతుంది అనే లెక్కల్లో పవన్ ఉన్నాడు.