పవనూ....నీకు కొంచం క్లారిటీ ఉండాలోయ్..   Pawan Kalyan Has No Clarity On Politics     2018-04-10   00:32:49  IST  Bhanu C

రాజకీయాలు అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు..రాజకీయాల్లో వచ్చిన తరువాత మనం మాట్లాడే, మాట్లాడబోయే మాటలు ఆచి తూచి మాట్లాడాలి..రాజకీయ జీవితంలో మనం వేసే ప్రతీ అడుగు సరిగ్గా ఉండాలి పొరపాటున తప్పటడుగు పడితే అక్కడితో అప్పటివరకూ సంపాదించిన పేరు అంతా ఒక్క సారిగా కొట్టుకు పోతుంది..అయితే దానికి ఉదాహరణకి సరిగ్గా సరిపోయే వ్యక్తి ఏపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎంతో క్రేజ్ ఉండేది..తన మాటకి యువకులు నుంచీ ఉద్యోగులు వరకూ తన సామాజిక వర్గం వారు ఇలా తనమీద అభిమానం చూపించే ప్రతీ ఒక్కరు విలువ ఇచ్చే వారు గౌరవించే వారు..


కానీ ఇదంతా ఒకప్పటి మాట..ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అవకాశ వాద రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచీ పవన్ ఇమేజ్ మెల్ల మెల్లగా డ్యామేజ్ అవుతూ వచ్చింది..అయితే ఈ క్రమంలోనే పవన్ పై ఉన్న క్రేజ్ తగ్గుతూ వచ్చింది..తాజాగా పవన్ చేసిన పాదయాత్ర ద్వారా తన స్థాయి మరింతగా తగ్గిపోయింది అని చెప్పవచ్చు..వామపక్షాలు ,జనసేన కలిసి పాదయాత్ర్ర చేసిన విషయం అందరికీ తెలిసిందే..అయితే అసలే వామపక్షాలు కన్ఫ్యూషన్ తో ఉంటాయి దానికి తోడూ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియని జనసేన తోడయ్యింది..వెరసి మీడియా మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేశారు..

వామపక్షాలు జనసేనతో కలిసి అమరావతిని గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. అమరావతి కాంక్రీట్ రాజధానిలా తయారు అవుతుందని దానిని ప్రజారాజధానిగా మార్చాలని వారు డిమాండ్ చేస్తూ పాదయాత్ర మొదలు పెట్టారు..అయితే ఈ క్రమంలోనే అసలు నాలుగు ఏళ్ల నుంచి రాజధానిలో అసలు పనులు ప్రారంభం కాలేదనేది వారి వాదన… అంతేకాదు రాజధాని నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని విభజన చట్టంలో ఉన్నా విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారని విమర్శలు కూడా చేశారు..

అయితే రాజధాని నిర్మాణం పై చర్చలు జరగాలి..వ్యయం తగ్గాలి అని అన్నారు ఇక్కడి వరకూ బాగానే ఉన్నా..ఒకపక్క అమరావతిని రాజధానిగా సెలెక్టు చెయ్యడమే తప్పు అంటూనే మరో పక్క అసలు నిర్మాణం ఏమీ జరగడం లేదు అంటూ కేంద్రం సహకారం ఇస్తుంది అందం చూస్తూ ఉంటే వినేవాళ్ళకి పిచ్చ పీక్ స్టేజి కి వెళ్ళడం ఖాయం అనిపిస్తుంది..అసలు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నామో….మాట్లాడే మాటలకి అర్థం ఉందా లేదా అనే ఆలోచనే లేకుండా అందరూ కన్ఫ్యూషన్ మైండ్ లో ఉండి ఏపీ ప్రజలని కూడా కన్ఫ్యూషన్ చేశారు..అసలే ప్రజా ఆదరణ తగ్గిపోతోంది అని భయపడుతున్న పవన కళ్యాణ్ కి ఇమేజ్ మరింత డ్యామేజ్ చేసింది మొన్న జరిగిన పాదయాత్ర