పవన్ రీసౌండ్ మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.రెండేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్, ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

 Pawan Kalyan Harish Shanker Movie To Be Solid, Pawan Kalyan, Harish Shanker, Dev-TeluguStop.com

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు సిద్ధమైన పవన్, తనకు గబ్బర్‌సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌తో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రాబోయే సినిమా పవన్ కెరీర్‌లో మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి తాజాగా పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లు సుదీర్ఘమైన చర్చ జరిపారు.

కథకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ ఓ ట్వీట్ చేశాడు.దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సీన్స్‌ను బిగ్ స్క్రీన్‌పై చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి ఈసారి పవన్ కోసం హరీష్ శంకర్ మరో అద్భుతమైన కథను రెడీ చేస్తున్నాడని, ఈ సినిమాతో పవన్ గ్యారెంటీ బ్లాక్‌బస్టర్ అందుకుంటాడని చిత్ర వర్గాల్లో అప్పుడే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.మరి పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా గబ్బర్‌సింగ్ రికార్డులను ఎంతమేర క్రాస్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube