పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagat Singh ).గబ్బర్ సింగ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది.ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్ ఇది.అప్పట్లో ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరు పెట్టారు.ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ పవన్ కళ్యాణ్ కి పెద్దగా నచ్చకపోవడం తో కొన్ని మార్పులు చేర్పులు చేసి, తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన సూపర్ హిట్ గా నిల్చిన తేరి మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు బాగా చేసారు.రీసెంట్ గానే షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసారు.

ఆ మొదటి షెడ్యూల్ కి సంబంధించి ఒక చిన్న టీజర్( Bhavadeeyudu Bhagat Singh Teaser ) కట్ ని సిద్ధం చేసి కొద్దీ రోజుల క్రితమే విడుదల చేసారు.దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రెండవ షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని మేకర్స్ ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా తెలిపారు.కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోతున్నాడు.
అందువల్ల ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్( Harish Shankar ) కి ఈ ఏడాది డేట్స్ కేటాయించడం కష్టం , నువ్వు ఈలోపు వేరే సినిమా చేసుకోని రా అని చెప్పాడట.
దీనితో హరీష్ శంకర్ కూడా ఇప్పుడు రవితేజ తో చెయ్యబొయ్యే సినిమా కి షిఫ్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం.హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన రైడ్( Ride ) అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా ఉండబోతుంది అట.

ఇది ఇలా ఉండగా వచ్చే ఏడాది అయినా ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రారంభం అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికలలో కచ్చితంగా 30 నుండి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి.ఆ స్థాయిలో ఆయనకీ సీట్లు వస్తే, సినిమాలు చెయ్యడం ఆపేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.దీంతో ఈ చిత్రం ఇప్పుడు ఉంటుందా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
దీనికి సమాధానం దొరకాలంటే ‘బ్రో ది అవతార్'( Bro The Avatar ) ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వేచి చూడాల్సిందే.ఎందుకంటే ఆ ఈవెంట్ కి హరీష్ శంకర్ పాల్గొంటాడు.
కచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడుతాడు.చూడాలి మరి ఆయన ఏమి చెప్తాడో అనేది.