గబ్బర్‌సింగ్ ను మరిపించేలా దేవిశ్రీ కష్టపడుతున్నాడట

పవన్‌ కళ్యాణ్‌ గతంలో గబ్బర్ సింగ్‌ సినిమా తో సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాల నడుమ మరో సారి గబ్బర్‌ సింగ్‌ కాంబోలో సినిమా రాబోతుంది.

 Pawan Kalyan Harish Shankar Movie Music Director Devi Sri Prasad-TeluguStop.com

అందుకు సంబంధించిన చిత్రీకరణ త్వరలో మొదలు కాబోతుంది.ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్ స్క్రిప్ట్‌ వర్క్ ను పూర్తి చేశాడనే వార్తలు వస్తున్నాయి.

మరో వైపు గబ్బర్‌ సింగ్‌ ను మించిన మాస్‌ కథ ఈ సినిమా లో ఉంటుందని అంటున్నారు.దాంతో ఖచ్చితంగా సినిమా మరో లెవల్‌ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

 Pawan Kalyan Harish Shankar Movie Music Director Devi Sri Prasad-గబ్బర్‌సింగ్ ను మరిపించేలా దేవిశ్రీ కష్టపడుతున్నాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం షూటింగ్‌ కోసం హరీష్‌ శంకర్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు.ఇటీవల కరోనా బారిన పడ్డ పవన్‌ కళ్యాణ్‌ కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.

రెండు వారాల్లో అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ లో పవన్‌ నటించబోతున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత హరీష్‌ శంకర్‌ తో సినిమా మొదలు కాబోతుంది.

హరీష్‌ శంకర్‌, పవన్ ల కాంబో మూవీ పట్టాలు ఎక్కక ముందే సినిమా కు సంబంధించిన రెండు పాటలు సిద్దం అయ్యాయంటూ దేవిశ్రీ ప్రసాద్‌ ప్రకటించాడు.దేవి శ్రీ ప్రసాద్‌ గతంలో గబ్బర్ సింగ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ పాట లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా గబ్బర్ సింగ్‌ తరహా మాస్ పాటలను దేవి శ్రీ ట్యూస్‌ చేశాడనే వార్తలు వస్తున్నాయి.ఒక ఐటెం సాంగ్‌ తో సహా నాలుగు పాటలు మరియు కూడా మాస్‌ మసాలా సాంగ్స్ ఉంటాయని అంటున్నారు.

దేవి శ్రీ చాలా కాలం తర్వాత పవన్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.కనుక అంచనాలు భారీగా ఉన్నాయి.అందుకే దేవిశ్రీ కష్టపడి మరీ ఈ సినిమా కు సంగీతాన్ని ఇస్తున్నాడు.

#Pawan Kalyan #PawanAnd #Devi Sri Prasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు