పవన్ బర్త్‌ డే కానుకగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' సర్‌ ప్రైజ్‌

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో నటిస్తున్నాడు.జులై లేదా ఆగస్టులో హరీష్‌ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Teaser For Birthday , Breaking News,  Fi-TeluguStop.com

ఆ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతూనే కొత్త సినిమాలు కూడా మొదలు పెట్టబోతున్నాడు.సాధ్యం అయినంత వరకు పవన్‌ ఎక్కవ సినిమాలను చేయాలని పట్టుదలతో ఉన్నాడు.

వరుసగా పవన్‌ సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్ వస్తున్నాయి.ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా నుండి చిన్న వీడియో బిట్‌ వచ్చింది.

పవన్‌ కళ్యాణ్ ఎంట్రీ కి సంబంధించిన ఆ వీడియో సినిమాపై అంచనాలు ఆకాశానికి లేపాయి. రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్‌ ను దక్కించుకుంది.

ఇక ఆ సినిమా టీజర్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా షూటింగ్ లు అన్ని ఎక్కడివి అక్కడ నిలిచి పోయాయి.

అయినా కూడా సినిమా టీజర్ ను సెప్టెంబర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

పెద్ద ఎత్తున సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్ ను నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందుతోంది.హరిహర వీరమల్లు సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం దాదాపుగా 50 కోట్లను ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి హరి హర వీరమల్లు సినిమా టీజర్ ను రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.పవన్‌ బర్త్‌ డే కు హరీష్‌ శంకర్‌ కూడా టైటిల్‌ ను రివీల్‌ చేయడం లేదా ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయడం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 ఈ ఏడాదిలోనే అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి.కరోనా కారణంగా ఆ సినిమా ఏమైనా ఆలస్యం అవ్వనుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube