Pawan Kalyan Hari Hara Veeramallu : రామోజీ ఫిల్మ్‌ సిటీలో పవన్ సందడి... మరో పదిరోజులు వీరమల్లు హడావుడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నాయి.గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update , Hari Hara Veeramallu,-TeluguStop.com

క్రిష్ దర్శకత్వం లో సినిమా అంటే విభిన్నమైన కాన్సెప్ట్ తో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఆయన గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది.అందుకే ఈ సినిమా పై కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు మరియు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండడం వల్ల హరిహర వీరమల్లు సినిమా కి ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోతున్నాడు.ఎట్టకేలకు ఏపీ నుండి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో సందడి చేస్తున్నాడు.

Telugu Harihara, Pawan Kalyan, Telugu-Movie

భారీ ఎత్తున యాక్షన్‌ సన్నివేశాల్లో పవన్ నటించాడు.దాదాపు 15 నుండి 20 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్స్ సభ్యులు ఇది వరకు ప్రకటించారు.ఇప్పటికే వారం నుండి పది రోజుల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.మరో వారం పది రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీ లో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ తో సినిమా యొక్క మెజార్టీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది అంటూ దర్శకుడు పేర్కొన్నాడు.ఈ సినిమా కు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా ఎం రత్నం నిర్మిస్తున్నాడు.

నిధి అగర్వాల్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube