హరిహర వీరమల్లు సినిమా లేటెస్ట్‌ రిలీజ్ డేట్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌

పవన్ కళ్యాణ్ అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతుంది.నిన్నటి నుండి సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వర్క్ షాప్ జరుగుతున్న విషయం తెలిసిందే.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update , Pawan Kalyan, Hari Har-TeluguStop.com

వర్క్ షాప్ లో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నాడు.హీరో హీరోయిన్ ఇతర నటీనటులు పాల్గొంటున్న ఈ వర్క్ షాప్ వారం రోజుల పాటు కొనసాగబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఆ వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారట.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ రెండవ వారం షూటింగ్ పూర్తి అవుతుందని దర్శకుడు క్రిష్ సన్నిహితులు చెబుతున్నారు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update , Pawan Kalyan, Hari Har-TeluguStop.com

సినిమా ఎట్టకేలకు షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ అయితే అతి త్వరలోనే రాబోతుంది అంటూ సమాచారం అందుతుంది.

ప్రస్తుతానికి సినిమాను నవంబర్లో పూర్తి చేసి వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 2023 ఏప్రిల్ నెలలో సినిమా ను విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.ఏప్రిల్ నెలలో పలు సినిమాలు విడుదలకు ఉన్నాయి.

కనుక డేట్ సెట్ అవ్వక పోతే మే నెలలో సినిమా ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ కు జోడిగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు చాలా విభిన్నంగా ఉండబోతున్నాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడు.మొదటి సారి పవన్ కళ్యాణ్ ఒక విభిన్నమైన పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న కారణంగా పవన్ అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందా చూడాలి.

Video : Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update , Pawan Kalyan, Hari Hara Veeramallu, Krish, Movie News, Nidh Agarwal, Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube