హరి హర వీరమల్లు సినిమా మరింత ఆలస్యం కానుందా?

Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.సెప్టెంబర్‌ మరియు అక్టోబర్ లోనే ఈ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update-TeluguStop.com

కాని కరోనా మరియు పవన్ రాజకీయ మీటింగ్‌ లు మరియు పర్యటనలు ఇలా పలు కారణాల వల్ల డిసెంబర్‌ వచ్చినా చిత్రీకరణ జరుగుతూనే ఉంది.డిసెంబర్ రెండవ వారం వరకు షూటింగ్‌ ఉంటుందని అంటున్నారు.

డిసెంబర్ మూడవ వారం లో పవన్ డబ్బింగ్‌ చెప్పడం జరుగుతుంది.ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయి.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Shooting Update-హరి హర వీరమల్లు సినిమా మరింత ఆలస్యం కానుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పట్లో లేదని అంటున్నారు.గత నెలలో చిత్ర యూనిట్‌ సభ్యులు డిసెంబర్ నెలలో కనీసం 20 రోజుల పాటు చిత్రీకరణ చేస్తామని చెప్పారు.

కాని 20 రోజులు ఏమో కాని ఒక్క రోజు కూడా షూటింగ్‌ జరిగే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

భీమ్లా నాయక్ మరీ ఆలస్యం అవుతున్న కారనంగా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కు మరింత సమయం పట్టబోతుంది.

జనవరిలో సంక్రాంతి తర్వాత హరి హర వీరమల్లు సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.ఇప్పటికే సమ్మర్‌ లో అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.కనుక సినిమా ను ఖచ్చితంగా జనవరిలో మొదలు పెట్టి మార్చి లో పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది.పవన్ తో క్రిష్ చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో పవన్ అభిమానులకు థ్రిల్ ను కలిగిస్తుందని అంటున్నారు.

పవన్ కు జోడీగా ఈ సినిమా లో నిధి అగర్వాల్‌ కనిపించబోతుంది.కీలక పాత్రలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కనిపించబోతుంది.పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా తో మొదటి సారి పవన్ ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది చూడాలి.

#Bheemla Nayak #Pawan Kalyan #HariHara #Nidhi Agrawal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube