క్లిక్‌ క్లిక్‌: హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్‌ ఇలా ప్రాక్టీస్‌

పవన్ కళ్యాణ్‌ మరో వారం రోజుల్లో వకీల్‌ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ప్రస్తుతం పవన్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

 Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Shooting Update-TeluguStop.com

ఒకటి రానాతో కలిసి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ కాగా మరోటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘.ఈ రెండు సినిమాల షూటింగ్‌ లు చక చక జరుగుతున్నాయి.రెండు సినిమాలకు కూడా భారీ ఎత్తున అంచనాలున్నాయి.కాని హరి హర వీరమల్లు సినిమా కు మాత్రం అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.ఇటీవలే వచ్చిన మోషన్‌ పోస్టర్ మరియు ఫస్ట్‌ లుక్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల కోసం హరి హర వీరమల్లు సినిమా రాబోతుంది అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

మొదట హరి హర వీరమల్లు సినిమా కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావించారు.కాని సినిమా పై ఉన్న అంచనాలు మరియు ఇతర విషయాల కారణంగా సినిమాను ఆలస్యం చేస్తున్నారు.

 Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Shooting Update-క్లిక్‌ క్లిక్‌: హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్‌ ఇలా ప్రాక్టీస్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా కోసం పవన్‌ అనేక యుద్ద విద్యలను నేర్చుకుంటున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్ సినిమా కోసం కర్ర సాముతో పాటు విలువిద్య మరియు బరిసెలతో కసరత్తు చేస్తున్నాడు.

సినిమా పై ఉన్న అంచనాల నడుమ ఈ చిత్రంను క్రిష్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం సినిమా షూటింగ్ ను ప్రముఖ స్టూడియోలో నిర్వహిస్తున్నారు.పవన్‌ సెట్స్ లో కసరత్తులు చేస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.సినిమా పై అంచనాలు మరింతగా పెంచే విధంగా ఇవి ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

పవన్‌ కళ్యాణ్ కు గతంలోనే మార్షల్ ఆర్ట్స్‌ లో ప్రావిణ్యం ఉంది.కనుక ఇది పెద్ద కష్టం కాదని ఆయన అభిమానులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

#HariHara #PawanKalyan #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు