పవన్‌ హర హర వీరమల్లు మహేష్‌ సర్కారు వారి పాట' ఏం జరుగబోతుంది?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు హర హర వీరమల్లు అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.మహా శివ రాత్రి సందర్బంగా టైటిల్‌ ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్ ను కూడా ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Pawan Kalyan Hara Hara Veeramallu Movie And Sarkaru Vaari Paata Movie Release Clash-TeluguStop.com

ఈ సినిమా ను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.కనుక పవన్ కళ్యాణ్‌ క్రిష్‌ ల కాంబో మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు.

కాని ఈ సినిమా ను మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇప్పటి వరకు విడుదల విషయమై ఎలాంటి అప్‌ డేట్‌ అయితే లేదు.

 Pawan Kalyan Hara Hara Veeramallu Movie And Sarkaru Vaari Paata Movie Release Clash-పవన్‌ హర హర వీరమల్లు మహేష్‌ సర్కారు వారి పాట’ ఏం జరుగబోతుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని పవన్‌ కు సన్నిహితంగా ఉండే వారు మా సోషల్‌ మీడియా లో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ను జూన్‌ లేదా జులై వరకు పూర్తి చేసినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ను సంక్రాంతి వరకు వెయిట్‌ చేయిస్తారట.

అంటే ఈ సినిమా షూటింగ్‌ ముగిసిన తర్వాత దాదాపు నాలుగు అయిదు నెలలు వెయిట్‌ చేయించబోతున్నారన్నమాట.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన పవన్‌ లుక్‌ లీక్ అయ్యింది.

దాంతో హర హర వీరమల్లు సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ ఈసినిమా ను క్రిష్‌ తెరకెక్కిస్తున్నాడు.అంతా బాగానే ఉంది కాని ఈ సినిమా ను మహేష్‌ బాబహీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా కు పోటీగా విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు ఏంటీ అంటూ టాక్‌ నడుస్తోంది.ఈ విషయమై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇద్దరు పెద్ద హీరోలు సంక్రాంతి కి వస్తే పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

#Mahesh Babu #HaraHara #Krish #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు