జాగ్వార్ కు పవన్ హ్యాండ్ ఇచ్చాడు..!  

Pawan Kalyan Hand To Jaguar Team-

జాగ్వార్ గా కన్నడ పరిశ్రమలో తెరంగేట్రం చేస్తున్న నిఖిల్ కుమార్ మూవీ తెలుగు ఆడియో ఆదివారం సాయంత్రం నోవాటెల్ లో ఘనంగా జరిగింది.అయితే అసలు ఈ ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.

మొన్నామధ్య పవన్ ను కలిసిన కుమారస్వామి తన తనయుడి సినిమా ఆడియోకి చీఫ్ గెస్ట్ గా పిలిచాడని అన్నారు.తీరా నిన్న జరిగిన ఆడియోకి మాత్రం పవన్ మళ్లీ డుమ్మా కొట్టేశాడు.

-

సొంత ఫ్యామిలీ ఫంక్షన్స్ కు రాని పవన్ తనని అభిమానంతో పిలిచే ఫంక్షన్స్ కు అటెండ్ అవుతాడు.

నితిన్, త్రివిక్రంల సినిమా ఆడియోలకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

నిన్న మాత్రం జాగ్వార్ ఆడియోకి వస్తా అని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడట.పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆడియో ఓ రేంజ్లో జరిగిందని చెప్పాలి.

మాజి ప్రధాని దేవేగౌడ, కేటీఆర్ తో పాటుగా చిత్రయూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో దీప్తి హీరోయిన్ గా చేయగా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా దసరా బరైలో దిగుతుంది.

తాజా వార్తలు

Pawan Kalyan Hand To Jaguar Team- Related....