అప్పట్లో పవన్ కళ్యాణ్ గుండు ఎందుకు కొట్టించుకున్నాడో తెలుసా…  

Pawan Kalyan Gundu Controversy Ghajini - Telugu Ar Muragadass, Gajini Movie, Paritala Ravi, Pawan Gundu News, Pawan Kalyan, Tollywood Power Star Pawan Kalyan

టాలీవుడ్ లో

మెగా ఫ్యామిలీ

నుంచి వచ్చినటువంటి హీరోల్లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే సినిమా పరిశ్రమలో అందరి హీరోలకు అభిమానులు మాత్రమే ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారని మంచి టాక్ ఉంది.

 Pawan Kalyan Gundu Controversy Ghajini

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది.అప్పట్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కొన్ని గుండు చేయించుకున్న ఫోటోలు నెట్టింట్లో తెగ

వైరల్

అయ్యాయి.

దీంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ కి రాయలసీమకు చెందినటువంటి ఓ

రాజకీయ నాయకుడు

తమ వ్యక్తిగత తగాదాల కారణంగా గుండు కొట్టించాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.అంతేగాక పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ గా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ వార్తలకి లేనిపోనివి కల్పించి తెగ వైరల్ చేశారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్ గుండు ఎందుకు కొట్టించుకున్నాడో తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

అప్పట్లో వచ్చినటువంటి ఈ వార్తల గురించి ఈ మధ్య కాలంలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు

ఏఆర్ మురుగదాస్

దర్శకత్వం వహించినటువంటి గజిని చిత్రం ఇటు హిందీలోనూ తమిళంలోనూ ఎంత మంచి విజయం సాధించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ కథకి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్నాడట ఏఆర్ మురుగదాస్.

అనుకున్నదే తడవుగా ఈ కథలు పవన్ కళ్యాణ్ కి వినిపించగా వెంటనే ఓకే చెప్పాడట.దీంతో ప్రీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకొని

గజిని

పాత్ర కోసం ఫోటో షూట్ చేయగా ఫోటోలను చూసినటువంటి పవన్ కళ్యాణ్ తాను ఈ పాత్రకి సూట్ అవ్వనని వెంటనే చిత్రానికి సంబంధించిన పనులను నిలిపివేశారట.అయితే అక్కడ పనిచేసే ఇటువంటి కొందరు వ్యక్తుల ద్వారా ఈ ఫోటోలు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ అంటే పడని కొందరు వ్యక్తులు ఇలా అసత్య వార్తలను ప్రచారం చేశారట.

అయితే అప్పట్లో ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ గాని లేదా మెగా కుటుంబంలో ఎవరూ స్పందించలేదు.మరి కనీసం ఇప్పుడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వార్తపై స్పందిస్తాడో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు

శ్రీరామ్ వేణు

దర్శకత్వం వహిస్తున్నటువంటి

“వకీల్ సాబ్”

అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Gundu Controversy News Related Telugu News,Photos/Pics,Images..