సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యింది.
దాంతో ఆ ప్రమోషన్ బాధ్యతలను సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు అయిన మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
తన చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు జరుగుతోంది.
ఈ వేడుక కోసం సాయి ధరమ్ తేజ్ వస్తాడా లేదా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ రాలేక పోతున్నాడు.
కాని ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడు అంటూ తేలిపోయింది.

చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక గెస్ట్ గా పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని సమాచారం అందుతోంది.కేవలం పవన్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ నుండి మరి కొందరు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు అనేది టాక్.
పెద్ద ఎత్తున అంచనాలున్న రిపబ్లిక్ మూవీలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.రమ్యకృష్ణ పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్నారు.రిపబ్లిక్ మూవీ కి విలక్షణ చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించడం ఇక్కడ ప్రత్యేక విషయం.పెద్ద ఎత్తున అంచనాలున్న రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 న విడుదల కాబోతున్న నేపథ్యంలో మంచి వసూళ్లు రావాలని అందరం కోరుకుందాం.
అలాగే సాయి ధరమ్ తేజ్ మరింత స్పీడ్ గా రికవరీ అయ్యి సినిమా విడుదల సమయం వరకు మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్ లో పాల్గొనాలని ఆశిద్దాం.
